రోహిత్ శర్మ పేరుమీద 200 రూపాయల నోటు! హైలెట్స్  వీడియో

మొహాలీ వేదికగా భారత్ vs శ్రీలంకా జట్లు మద్య జరిగిన రెండొవ వండే లో భారత్ అద్బుతమైన విజయంలో కీలకపాత్ర పోషించిన రోహిత్ శర్మా పై ప్రశంశల జల్లు కురుస్తున్నది. ఇప్పటివరకు ఏ ఇతర క్రికెటర్ కి సాద్యంకాని రీతిలో ఏకంగా మూడోవ డబుల్ సెంచరీ చేసిన రోహిత్… తన భార్య రితిక సమక్షంలో పెళ్లికానుకగా చేసిన ఈ డబుల్ సెంచరీ చాలా ప్రత్యేకం… దానికి తగినట్లుగానే తన భార్య హావ భావాలు రోహిత్ నే కాకుండా యావత్ క్రికెట్ లవర్స్ కి చిరస్థాయగా గుర్తుపెట్టుకుంటారు.

మ్యాచ్ మొత్తాన్ని చూసిన నెట్జెన్స్ తమ క్రియేటివ్ బ్రెయిన్ కి పని చెప్పారు… రక రకాలు కామెంట్లు, ఇమేజ్ లతో తమ అబిమానాన్ని చాటు కుంటున్నారు. అందులో ముక్యంగా రోహిత్ బొమ్మని 200 నోటుపై ముద్రించిన ఇమేజ్ విపరీతంగా వైరల్ అవుతున్నది. నిలబడి అతడికి సెల్యూట్‌ చేయాలని మరికొందరు సూచించారు. రోహిత్‌ ఈ రోజు ఆడిన ఆట చాలా గొప్పగా ఉందని పలువురు క్రికెటర్లు ప్రశంసించారు.

110 బంతుల్లో సెంచరీ చేసిన రోహిత్‌.. తర్వాతి వంద పరుగులను కేవలం 35 బంతుల్లో పూర్తి చేయడం అద్భుతమని వీరేంద్ర సెహ్వాగ్‌ కొనియాడు. రోహిత్‌ బ్యాటింగ్‌ చూడటానికి ఎల్లప్పుడూ ఆసక్తి చూపిస్తానని సచిన్‌ టెండూల్కర్‌ పేర్కొన్నాడు. అమితాబ్‌ బచ్చన్‌సౌరవ్‌ గంగూలీ తదితరులు రోహిత్‌ను ప్రశంసించారు.

Prev postPage Next post

Leave a Reply

*