కోహ్లి బాల్ ట్యాంపరింగ్‌ పై సంచలన కామెంట్స్ చేసిన కుక్

వైజాగ్ వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్ట్ లో టీమిండియా అద్భతమైన విజయాని సొంతం చేసుకున్న విషయం అందరకి తెలిసినదే… అయితే ఇండియా కెప్టన్  విరాట్ కోహ్లిపై ఎన్నడు లేనిది బాల్ ట్యాంపరింగ్‌ ఆరోపణలు వచ్చాయి, ఆమాటలను కోహ్లి కొట్టిపారేసినా ఇంగ్లాండ్ మీడియా ఇప్పటికి రచ్చ చేస్తోంది. రేపటినుండి  భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మొహాలిలో మూడో టెస్ట్ మ్యాచ్ జరగనున్న నేపధ్యంలో  ఇంగ్లాండ్ కెప్టన్ కుక్ కోహ్లి ట్యాంపరింగ్‌ పై స్పందించాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో సఫారీ కెప్టెన్ డుప్లెసిస్‌పై కూడా బాల్ ట్యాంపరింగ్‌ ఆరోపణలు వచ్చాయి.

అయితే బాల్‌ను ఏ విధంగా పట్టుకోవచ్చు, ఎలా పట్టుకోకూడదు అనే అంశాలపై ఐసీసీ చెప్పే వివరణ కోసం బహుశా కోహ్లీ,డుప్లెసిస్ ఎదురు చూస్తున్నారని తాను భావిస్తున్నట్టు తెలిపాడు కుక్.   అంతే కాకుండా ప్లేయర్స్ చూయింగ్ గమ్ నములుతారు,బ్రేక్ సమయంలో నోట్లోకి తియ్యగా ఉండే కొన్ని జెల్లీ బీన్స్‌ను తీసుకుని, వాటి సహాయంతో బాల్ని రుద్దే అవకాశముందని, దీని వలన బంతి గోధుమ రంగులోకి మారుతుందని చెప్పాడు కుక్. అయితే చూయింగ్ గమ్‌పై చెయ్యి పెట్టి ఆ వెంటనే బంతిని తాకవచ్చా లేదా అనేది స్పష్టం కావాల్సి ఉందని, దీనిపై ఐసీసీ స్పష్టత ఇస్తే అక్కడితొ సమస్య ముగుస్తుందని తెలిపాడు.

Prev postPage Next post

Leave a Reply

*