బాల్‌ టాంపరింగ్‌ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన కోహ్లి?

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నవంబరు 9 నుంచి 13 వరకు రాజ్‌కోట్‌ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్టు జరిగిన సంగతి తెలిసిందే. నోట్లో ఉన్న ఓ స్వీటు పదార్థం ద్వారా కోహ్లీ బంతి మెరుపును పోగొట్టేందుకు ప్రయత్నించాడంటూ… ఈ మ్యాచ్‌లో కోహ్లీ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడినట్లు బ్రిటీష్‌ పత్రిక ‘ది డైలీ మెయిల్‌’ మంగళవారం ఓ కథనాన్ని మరియు ఆధారంగా వీడియోను ప్రచురించింది. నోట్లో స్వీటు పదార్థం ఉన్నప్పుడు కోహ్లీ తన కుడి చేతిని పలుమార్లు నోట్లో పెట్టి… దాన్ని బంతికి రుద్దడంతో బంతి మెరుపు కోల్పోయిందని పేర్కొంది.

అయితే ఈ విషయంపై విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ ఓడిపోయిన తర్వాత ఆ ఇంగ్లీష్‌ పత్రిక ఈ కథనాన్ని ప్రచురించడాన్ని పలువురు తప్పుపట్టారు. టాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆటగాళ్లు లేదా అంపైర్లు గుర్తించి నిబంధనల ప్రకారం ఐదు రోజులలోపు ఐసీసీకి ఫిర్యాదు చేయాలి. కాని దీనిపై ఇంగ్లండ్‌ ఆటగాళ్లు గాని, అంపైర్లు గాని ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అందుకే ఆ కథనాన్నే తప్పుపడతున్నారు.

Prev postPage Next post

Leave a Reply

*