కరణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ… చెన్నై టెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్

భారత్  ఇంగ్లండ్‌‌ మధ్య చెన్నైలో  జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భారత ఆటగాడు కరుణ్ నాయర్ తన అద్భుతమైన బ్యాటింగ్ తో ట్రిపుల్ సెంచరీ బాదాడు. తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మార్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 299 పరుగుల వద్ద ఉండగా అదిల్ రషీద్ బౌలింగ్‌లో ఫోర్ బాది 303 పరుగులు చేశాడు.

381 బంతులు ఎదుర్కొని 32 ఫోర్లు, 4 సిక్సర్లతో 79.10 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అయితే మరో పక్క రవీంద్ర జడేజా తన టెస్ట్ కెరీర్‌లో 4వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని కురుణ్‌కు జతగా క్రీజ్‌లో కొనసాగుతుండగా 51 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్యాచ్ ఔటయ్యాడు. ఇరువురు 140కి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో కరుణ్‌కు జతగా ఉమేష్ యాదవ్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఇంగ్లండ్‌పై ప్రస్తుతం టీమిండియా 282 పరుగుల ఆధిక్యంలో ఉంది.

స్కోర్ వివరాలు..

ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ : 477/10

భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ : లేకేష్ రాహుల్ 199, పార్ధివ్ పటేల్ 71, పుజారా 16, కోహ్లీ 15, కరుణ్ నాయర్ 303(నాటౌట్), మురళీ విజయ్ 29, అశ్విన్ 67, జడేజా 51. మొత్తం : 759/7(డిక్లేర్)

Prev postPage Next post

Leave a Reply

*