కోహ్లి కెప్టన్సీ లో అన్నీ టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఏకైక క్రికెటర్ ఒక్కడే తెలుసా?

2014లో విరాట్ టెస్టు పగ్గాలు చేపట్టిన నాటి నుంచి భారత జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. మొహాలీలో 20వ టెస్టు మ్యాచ్‌కు నాయకత్వం వహిస్తున్నాడు విరాట్ కోహ్లి. విరాట్ నాయకత్వం వహించిన 20 టెస్టుల్లోనూ ఆడిన ఏకైక ప్లేయర్‌గా స్టార్ బ్యాట్స్‌మెన్ అజింక్య రహానే ఘనత సాధించాడు. అతను కాకుండా మిగిలిన ఏ ఆటగాడు కూడా విరాట్ నాయకత్వంలో అన్ని ఆటలు ఆడలేదు.

కోహ్లీ నాయకత్వంలోనే కాకుండా బ్యాట్స్‌మెన్ గానూ విరాట్ కోహ్లీ పరుగులు తీస్తున్నాడు. వైజాగ్ టెస్టుకు ముందు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉన్న కోహ్లీ  ఆ టెస్టు ముగిసే సమయానికి ఏకంగా 4వ స్థానానికి దూసుకొచ్చాడు. 19 టెస్టుల్లో కోహ్లి సేన 11 విజయాలు సాధించగా, కేవలం రెండింటిలో మాత్రమే ఓటమిపాలైంది. మిగతా ఆరు టెస్టులు డ్రాగా ముగిశాయి.

Prev postPage Next post

Leave a Reply

*