గుడి విష్ణువుది! విగ్రహం శివునిది. ఎక్కడంటే… ఎందుకంటే…

గుడి విష్ణువుది, విగ్రహం శివునిది అదేమిటి అనుకుంటున్నారా? అవును ఈ గుడి గురించి మీలో కొందరికి తెలిసే ఉంటుంది. తెలియని వారి కోసం ఇక్కడ ఆ గుడి ఎక్కడ ఉంది? అసలు విష్ణువు గుడిలో శివుని విగ్రహం ఎలా వచ్చింది అనేది వివంగా చెప్పబడినది.

ఎక్కడంటే…

కర్నూలు జిల్లాలో దక్షిణం వైపున విస్తరించిన ఎర్రమల కొండ ప్రాంతంలో యాగంటి కలదు. కర్నూలు నుండి బనగానపల్లె 75 కిలోమీటర్లు దూరంలో ఉండగా, ఇక్కడ నుంచి బస్సు సౌకర్యం గలదు. ట్రైన్ లో వచ్చేవారు బనగానపల్లెకు దగ్గరలో ఉన్న స్టేషన్లో దిగి, అక్కడ నుంచి ప్రైవేటు వాహనాలలో షేర్ ఆటోలు, బస్సులు, జీపులు మొదలైన వాటిలో బనగానపల్లెకు చేరాలి. బనగానపల్లె నుండి యాగంటికి వెళ్ళడానికి బస్సులు ఉంటాయి గాని, ఆర్ టి సి బస్సు రోజుకు రెండు సార్లు మాత్రమే వస్తాయి. లేదంటే షేర్ అటో లో లేక సొంత వాహనాలలో చేరుకోవచ్చు. దారిలో నవాబు బంగ్లా కనిపిస్తుంది. ఇందులోనే అరుంధతీ, అధినాయకుడు వంటి చిత్రాలను షూట్ చేసింది అక్కడే. ఈ కోటని బయట నుంచే చూడాలి గాని లోపలికి ప్రవేశం ఉండదు.

ఎందుకంటే…

విష్ణువు గుడిలో శివుని విగ్రహం ఎలా వచ్చిందంటే… అగస్త్య మహర్షి తపస్సు చేసిన తరవాతా విష్ణువు కు ఆలయాన్ని కట్టాలని అనుకుని, ఆలయం మొత్తం నిర్మాణం పూర్తి చేస్తాడు. గర్భగుడి లో చెక్కిన వెంకటేశ్వర విగ్రహాన్ని లోనికి తీసుకొని వెళుతుండగా, విగ్రహం యొక్క కాలి బొటనవేలు విరిగిపోతుంది. విరిగిన విగ్రహాన్ని ప్రతిష్టించకూడదెలా అని ఆలోచిస్తుండగా, మహర్షికి ఈశ్వరుడు ప్రత్యక్షమై ” మహర్షి ఇక్కడ ఏడాది పొడవునా పారే జలపాతం ఉన్నది. నేను అభిషేక ప్రియుణ్ణి, కనుక ఎల్లప్పుడూ నీరు పారే చోట నాకు ఆలయం కట్టించాలి కానీ విష్ణువుకు కాదు. కనుక నా శివలింగాన్ని ప్రతిష్టించు” అని చెప్పాడు. అప్పుడు శివుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆలయంలో అమ్మవారు ఉండరు. శివునిలోనే భాగమై ఉన్నట్లు భావిస్తారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే విష్ణు ఆలయం మాదిరే ద్వారపాలకులు మరియు ఇతర విగ్రహాలు ఉంటాయి.

ఈ ఆలయానికి దగ్గరలో కొండ మీద సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ లో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. యాగంటి ఆలయ కోనేరు ని ‘అగస్త్య పుష్కరణి’ అని అనగా, ఈ నీరు ఎక్కడ నుంచి వస్తుంది, ఎలా ప్రవహిస్తుంది ఎవ్వరికి తెలియదు. ఈ నీరు ఎప్పుడూ ఫ్రెష్ గా తియ్యగా ఉంటాయి. ఆలయ గర్భగుడిలో ఉమామహెశ్వరుడు కొలువై ఉంటాడు. ఎదురుగా బసవన్న (నంది) విగ్రహం ఉంటుంది. ఈ నంది రోజురోజుకు పెరుగుతూ ఉంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానం లో చెప్పబడింది ఈ నంది గురించే. అగస్త్య ముని ధ్యానంలో ఉన్నప్పుడు కాకులు ఆయన చుట్టూ చేరి గోల చేసేవాట. కోపంతో ముని సపించడం వలన ఆ ఆలయం చుట్టూ కాకుకు కనిపించవు. ఆగస్త్య మహర్షి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించిన గుహను వెంకటేశ్వర గుహ అని,ఇక్కడే పక్కన ఉన్న మరో గుహలో శివలింగాన్ని ప్రతిష్టించినాడు దీనినే రొకళ్ల గుహ అని పిలుస్తారు. శంకర గుహ అని మరో గుహ ఉంది అక్కడ. వీరబ్రహ్మేంద్ర స్వామి తన శిష్యులకి జ్ఞానోపదేశం ఇక్కడే చేసేవారంట.

ya1 ya2 ya3 ya4 ya5 ya6 ya7 ya8 ya9 ya10 ya11

Next
Page

Leave a Reply

*