మోడీ రూ. 500 ఉచిత రీఛార్జ్, లింక్ చూసారా..?

ఈమధ్య ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఉచితంగా రూ .500 రీఛార్జ్ అయిపోతుంది. వెంటనే రీఛార్జ్ చేసుకుని, మరో 15 మంది ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయడంటూ ప్రధాని నరేంద్రమోదీ పేరుమీదనే ఓ లింకు వైరల్ అవుతున్న సంగతి అందరికి తెలిసినదే. నోట్ల రద్దు తరవాత ప్రధాని నిజంగానే ఈ ఆఫర్ ఇచ్చారని చలామంది అనుకుని ఆ లింకును ఓపెన్ చేస్తున్నారు. అయితే అది ఇలా ఓపెన్ అవ్వగానే… వ్యక్తిగత సమాచారమంతా లీకైపోయి, హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుందట.

ప్రధాని పేరు మీద సర్క్యూలేట్ అయ్యే http://balance.modi-gov.in/ ఈ లింకు ఓపెన్ చేసినా, క్లిక్ చేసినా ప్రజలకు హానికరమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్, ఆపరేటర్, రాష్ట్రం వంటి వివరాలు ఇవ్వాలి. అన్ని వివరాలు నింపిన తర్వాత రీఛార్జ్ బటన్ నొక్కగానే, మరో కొత్త పేజీ ఓపెన్ అయ్యి, ఈ పేజీలో లింకును మరో 15 మంది స్నేహితులకు షేర్ చేయాలని చెబుతుంది.అయితే ఈ వెబ్‌సైట్‌లో నింపే సమాచారం హ్యాకర్ల చేతిలోకి వెళ్తుందని, యూజర్ల సమాచారాన్ని వారు తప్పుడు కార్యకలాపాలకు వాడుతున్నారని వెల్లడైంది. ఈ లింకులు చాలా ప్రమాదకరమని, ఎట్టిపరిస్థితుల్లో వాటిని ఓపెన్ చేయొద్దని హెచ్చరికలు వస్తున్నాయి.

Prev postPage Next post

Leave a Reply

*