వీ6 చానల్‌ న్యూస్‌ రీడర్‌ రాధికా రెడ్డి ఆత్మహత్యకు కారణం వెలుగులోకి…

వీ6 చానల్‌ న్యూస్‌ రీడర్‌ రాధికా రెడ్డి ఆత్మహత్యకు కారణం వెలుగులోకి

వీ6 చానల్‌ న్యూస్‌ రీడర్‌ వెంకన్నగారి రాధికా రెడ్డి (36) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. రాధిక ఆత్మహత్య సమాచారం అందిన వెంటనే కూకట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.


మూసాపేట్‌లోని గూడ్స్‌షెడ్‌ రోడ్డు శ్రీవీలా అపార్టుమెంట్‌ రెండో ఫ్లోర్‌204 ఫ్లాట్‌లో నివసిస్తుంది. ఆమె ఆదివారం రాత్రి 10.40 సమయంలో డ్యూటి నుంచి ఇంటికొస్తూనే అపార్టుమెంట్‌ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.


ఆరు నెలల కిందట భర్త నుంచి రాధిక విడాకులు తీసుకుంది. బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న తన 14 ఏళ్ల కుమారుడు, తల్లిదండ్రులతో కలసి ఆమె అపార్ట్‌మెంట్‌లో నివాసముండేది. అనుకోకుండా ఆమె ఇలా ఆత్మహత్య చేసుకుకోవడం ఆమె కుటుంబ సభ్యలు, సన్నిహితులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

అయితే ఆమె బ్యాగులో సూసైడ్‌ లెటర్‌ లభ్యమైంది. ‘కేవలం నా డిప్రెషన్‌ వల్ల మాత్రమే చనిపోతున్నాను. నా మెదడు నా శత్రువు’ అని నోట్‌లో రాసి ఉంది. పోలీసులు మాత్రం ఆమె మరణానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అంటూ ఆరా తీస్తున్నారు..

Prev postPage Next post

Leave a Reply

*