ఓటుకి నోటు స్థాయిలో మరోసారి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు

ఆదివారం జరిగిన ఏపీ కేబినెట్ విస్తరణలో మొత్తం 11 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో నలుగురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారు ఉన్నారు. అఖిల ప్రియ, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావులు 2014లో వైసిపి నుంచి గెలిచి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి మంత్రి పదవులు దక్కాయి.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. 2014లో వైసిపి నుంచి గెలిచి, ఆ తర్వాత టిడిపిలో చేరిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని, వారితో రాజీనామా చేయిస్తే, తాను రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. గతంలో తాను టిడిపి నుంచి గెలిచి, తెరాసలో చేరి మంత్రి పదవి తీసుకుంటే టిడిపి నేతలు ప్రశ్నించడాన్ని ఆయన గుర్తు చేస్తూ… అప్పుడు తమతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ నిర్ణయాన్ని కూడా చంద్రబాబు తప్పుబట్టారని, ఇప్పుడు వేరే పార్టీ వాళ్లను మంత్రులుగా అదే గవర్నర్‌తో ప్రమాణ స్వీకారం ఎలా చేయించారని ప్రశ్నించారు. మాకు మంత్రి పదవులు ఇవ్వవద్దని ఢిల్లీ దాకా కాళ్లు అరిగేదాకా తిరిగారని తలసాని మండిపడ్డారు. నిజాయితీ, నిప్పు అనే పదాలు ఇక నుంచి చంద్రబాబు ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిదని అన్నారు.

నీతి, నిజాయతీ, నిబద్దత ఇలాంటి పదాలు ఎక్కువ వాడే చంద్రబాబు నాయిడు మొదటి సారి అడ్డంగా దొరికిపోయింది మాత్రం ఓటుకి నోటు కేసులోనే… అప్పట్లో ఆయన టెలిఫోన్ సంభాషణ “మనవాళ్లు బ్రీఫేడ్ మి” ఒక సంచలనం. ఆఎపిసోడ్ కారణంగా చంద్రబాబు నోట మాట రాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో ఆయన పరవు అడ్డంగా పోయింది.

ఆతరువాత విపక్షం నుండి గెలిచిన MLA లని పదుల సంకెలో చేర్చుకున్న చంద్రబాబు వాళ్లకి మంత్రి పదవులుసైతం కట్టపెట్టాడు. తెలుగు దేశం పార్టీ నుండి గెలిచిన తలసాని ని కెసిఆర్ మంత్రి చెయ్యడంతో చంద్రబాబు లో నీతి నిజాయతీ పరుడు అంతెత్తున లేచి , తలసాని, కెసిఆర్, గవర్నర్ మీద ఒక రేంజిలో ఫైర్ అయ్యాడు. అదేవిషయాన్ని ఇప్పుడు తలసాని గుర్తు చేస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే… ఓటుకు నోటు కేసు స్థాయిలో చంద్రబాబు పరువు గంగలో కలిసిపోయిందని నెట్జన్లు సెటైర్లు వేసుకుంటున్నారు. కొంత మందైతే బార్డర్ క్రాస్ చేసి చంద్రబాబు ని వ్యక్తిగత దోషనలకి దిగుతున్నారు. బారత దేశంలోనే సీనియర్ రాజకీయ నాయికుడని చెప్పుకునే చంద్రబాబు గారు ఇలాంటి నీచమైన తప్పులు చెయ్యకుండా ఉంటే బాగున్ను!.

Prev postPage Next post

Leave a Reply

*