Breking news : తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా..

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం రాజీనామా లేఖ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ చేతికి ఇచ్చినట్టు పుకార్లు వస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత రాష్ట్రంతో పాటు, పార్టీలో కూడా పరిస్థితులు బాగోకపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని అన్నాడీఎంకే పార్టీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి.

శశికళ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ప్రభుత్వంలో కీలక మంత్రి పదవిలో ఉన్న ఉదయ్ కుమార్, లోక్‌సభ డిప్యూటి స్పీకర్ తంబిదురై తదితరులు శశికళ సీఎం కావాలని మీడియా ముందు బహిరంగంగా చెప్పారు. శశికళ కోసం పన్నీర్ సెల్వం తన సీఎం పదవికి రాజీనామా చేసి త్యాగం చేస్తారని వారు అనడం వలన, సొంత పార్టీలోనే తనకు వ్యతిరేకంగా మాట్లాడతున్నారని  విసుగు చెందిన పన్నీర్ సెల్వం సీఎం పదవికి రాజీనామా చేసి ఆ లేఖను శశికళకు ఇచ్చేశారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.

అయితే పన్నీర్ సెల్వం కాని, శశికళ ఈ విషయంపై ఇప్పటివరకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదు కాని శశికళ ఎప్పుడు సీఎం కావాలనుకుంటే ఆ రోజు పన్నీర్ సెల్వం ఇచ్చిన రాజీనామా లేఖను బయటపెడుతారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.

Prev postPage Next post

Leave a Reply

*