ఒక్క రూపాయి తో విమాన ప్రయాణం!

ఒక్క రూపాయి తో విమాన ప్రయాణం ఏమిటని అనుకుంటున్నారా? అవును నిజంగా ఒక్క రూపాయితో విమానం ఎక్కే అవకాశం ఉంది. నిత్య సరుకుల ధరలు ఆకాశంలో ఎగురుతున్న ఈరోజుల్లో, ఆకాశంలో ఎగిరే విమానం మాత్రం ఒక్క రూపాయికి ఎలా ఎక్కచ్చు అని అనిపిస్తుంది కదా. విమాన‌యాన సేవ‌ల సంస్థ‌గా పేరున్న ఎయిర్ డెక్కన్ ఈ చాన్స్ క‌ల్పిస్తోంది.

అదెలా అంటే… రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ లేదా ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ (యూడీఏఎన్) కింద తమ ఆపరేషన్స్‌ను ఈ నెల 22 నుంచి మొదలుపెట్టనుంది. ఎయిర్ డెక్కన్ తొలి విమానం ముంబై, నాసిక్ మధ్య ఎగరనున్నది. ఇందులో రూ.1400 నుంచి ప్రారంభ ధరలు ఉన్నా.. కొందరు లక్కీ విన్నర్లకు రూపాయికే ఇస్తామని సంస్థ ప్రకటించింది. ఇక ఎవరికీ ఈ అదృష్టం ఉందొ పరీక్షించుకోవడమే.

ఉడాన్ (యూడీఏఎన్‌) అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగ‌రిక్. జాతీయ పౌర విమాన‌యాన ప‌థ‌కం కింద ఉడాన్ స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. 500 కిలోమీట‌ర్ల దూరానికి లేదా 30 నిమిషాల జ‌ర్నీకి కనీసం రూ.2500 ఛార్జ్ చేస్తున్నారు. ఈ ప‌థ‌కం ద్వారా సుమారు 45 విమానాశ్ర‌యాల‌ను క‌ల‌పాల‌న్నదే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్దేశం. కడప-హైదరాబాద్, నాందేడ్-హైదరాబాద్ మధ్య కూడా ఉడాన్ సేవల లిస్టు లో ఉన్నాయి.

ఈ స్కీమ్ కిందే ఎయిర్ డెక్కన్ 34 రూట్లను సొంతం చేసుకుంది ఈ హక్కులు దక్కించుకున్న ఎయిర్‌లైన్స్ తమ విమానంలో ఉన్న సగం సీట్లను డిస్కౌంట్లలో ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం నుంచి సబ్సిడీ లభిస్తుంది. దీని గురించి ప్రధాని మోడీ మాట్లాడుతూ…  “ట్యాక్సీల్లో ప్రయాణిస్తే కిలోమీటర్‌కు సుమారు రూ.10 ఖర్చు అవుతోంది. ఉడాన్ సర్వీసుల్లో కిలో మీటర్‌కు రూ.6 నుంచి రూ.7 వరకు ఉంటుంది“ అని అన్నారు.సామాన్యులకు విమాన ప్రయానాలు అందుబాటులో ఉండేందుకే.. ఉడాన్ విమాన సర్వీసు ముందుకు వచ్చిందని అన్నారు.

Prev postPage Next post

Leave a Reply

*