టీఆర్ఎస్ అద్యక్షుడిగా కొత్త రెడ్డి? ఒక్క దెబ్బకి రెండు పిట్టలు…

మరో రాజకీయ ఎత్తుగడతో ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ముందడుగు వేయబోతున్నారు. తెలంగాణాలో కీలకంగావున్న రెడ్డి సామాజిక వర్గంలో పెరుగుతున్న అసహనాన్ని గుర్తించిన ఆయన వారిని అందల మెక్కించి బుజ్జగించడమే కాకుండా, రేవంత్‌రెడ్డి రాబోయే ఎన్నికల నాటికి తమ సామాజిక వర్గం వారందరినీ ఒక్కతాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నానికి కూడా సరైన సమాధానంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదట సీనియర్ నేత హోంమంత్రి నాయని నర్సింహారెడ్డి పేరు వినబడినప్పటికి, యువకుడైన పల్లా రాజేశ్వరరెడ్డి వైపే ఆశక్తి చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం శాసనమండలి సభ్యుడు.. విప్‌గా ఉన్న రాజేశ్వరరెడ్డికి ఏప్రిల్‌లో జరిగే తెలంగాణా రాష్ట్ర సమితి ప్లీనరీలో అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టే అవకాశం ఉందని అనుకుంటున్నారు. సీఎంకి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న రాజేశ్వరరెడ్డి… వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలానికి చెందిన ఈయన పెరిగింది మాత్రం నల్గొండ జిల్లాలో! అనురాగ్ విద్యా సంస్ధల అధినేతగావున్న ఆయన… సీఎంకి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు.

ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్న రీతిలో తమ పార్టీలో కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్న వారిని కట్ చేయడంతోపాటు, ప్రత్యర్ధి పార్టీలు కులాల ప్రాతిపదికన తమని ఇబ్బంది పెట్టకుండా చేసుకోవడం కోసమే గులాబీ అధిపతి ఈ ఆలోచన చేస్తున్నట్టు ముఖ్యమంత్రి సన్నిహితులు అంటున్నారు. ఒక్క వ్యక్తికి ఒక్క పదవి ఉండాలన్న నిబంధనని కూడా త్వరలోనే తీసుకురాబోతున్న కెసిఆర్ ముందుగా తననుంచే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది.

Prev postPage Next post

Leave a Reply

*