హిల్లరీ పాస్వోర్డ్ లీక్… ఇంత సిల్లీ పాస్వోర్డ్ చిన్న పిల్లలు కూడా పెట్టుకోరు

వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే నిన్న చేసిన ప్రకటన అమెరికాలో మరిన్ని చర్చలకు దారితీస్తోంది. అమెరికా అధ్యక్షఎన్నికలలో హాకింగ్ జరిగిందంటూ డెమొక్రాటిక్ పార్టీ సభ్యుల నుంచి వ్యక్తమవుతున్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చే అంశం బయటపడింది. వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే చేసిన ప్రకటనలో… హిల్లరీ క్లింటన్ ప్రచార విభాగానికి చైర్మన్‌గా వ్యవహరించిన జాన్‌పొడేస్టా కంప్యూటర్ పాస్‌వర్డ్ ‘‘పాస్‌వర్డ్’’ అని, 14 సంవత్సరాల బాలుడు కూడా ఈ కంప్యూటర్ హాక్ చేయవచ్చునని తెలిపారు.

ప్రచారవిభాగంలో పనిచేసే వారందరికీ కంప్యూటర్ పాస్‌వర్డ్‌ తెలుసునని, అమెరికా అధ్యక్షఎన్నికల ఫలితాలను మార్చేందుకు వీలుగా, ట్రంప్ అనుకూల ఫలితం కోసమే జాన్‌పొడేస్టా ఇలా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. అయితే ఆయన వ్యాఖ్యలకు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ… డెమొక్రాటిక్ పార్టీ సభ్యులను 14 సంవత్సరాల బాలుడు కూడా హాక్ చేయగలిగే విధంగా కంప్యూటర్ పాస్‌వర్డ్‌ని ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. పాస్‌వర్డ్‌ని అలా పెట్టుకోమని రష్యా చెప్పలేదని ఆయన ఆరోపించారు.

Prev postPage Next post

Leave a Reply

*