ఏప్రిల్‌ 1 నుంచి ప్రతిఒక్కరు తెల్సుకోవలసిన కొత్త  ఇన్‌కంటాక్స్‌ రూల్స్‌..

2017 ఆర్థిక బడ్జెట్‌ సందర్భంగా  ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివిధ ఆదాయ పన్ను చట్ట సవరణలను  ప్రకటించారు. 2017-18  ఆర్థికబిల్లును  బుధవారం లోక్‌సభ ఆమోదం తెలుపగా, దీని ప్రకారం  ఏప్రిల్ 1, 2017 నుండి కొన్ని ఆదాయ పన్ను చట్టాలు మారనున్నాయి.  ఏప్రిల్‌ 1 నుంచి  ఇన్‌కంటాక్స్‌ రూల్స్‌ ఇలా ఉండబోతున్నాయి.

1) 87ఎ సెక్షన్‌  ప్రకారం… రూ. 2.5 లక్షలు- రూ. 5 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి పన్ను శాతం  తగ్గనుంది.  అలాగే మొత్తం ఆదాయం రూ.1 కోటి లోపు ఉంటే,  ఆదాయపు పన్ను 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గనుంది. దీంతో ఏడాదికి రూ. 12, 500 పన్ను తగ్గనుంది. సర్‌ఛార్జ్‌, సెస్‌లతో కలుపుకుని రూ. 14, 806 రూపాయలు ఆదా కానుంది.  రూ.3-5లక్షల ఆదాయం ఉన్నవారు రూ.7700, రూ. 5-50 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ.12,900 ఆదా కానున్నాయి. అయితే రూ.3.50 లక్షలు  ఆదాయ పన్నుచెల్లించేవారికి మాత్రం ఈ  రిబేటు వర్తించదు.

2)స్థిరాస్థులపై పెట్టుబడులను లాంగ్‌టెర్మ్‌గా పరిగణిచేందుకు కాలపరిమితిని 3 ఏళ్ల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించారు. దీంతో స్థిరాస్తులపై 2 సంవత్సరాలకు మించిన పెట్టుబడులపై పన్ను 20 శాతానికి పరిమితం చేయడంతో పాటు, తిరిగి పెట్టుబడులు చేయడంపై పలు మినహాయింపులకు అర్హత లభిస్తుంది.

౩) రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి లోపు ఆదాయం ఉన్న సంపన్నులకు పన్నుపై  పది శాతం  సర్‌ఛార్జ్ విధింపు.  ఇదిగతంలో  15 శాతంగా ఉంది. అయితే రూ. 1 కోటి కంటే ఎక్కువ  ఆదాయం గల వారికి మాత్రం ఈ సర్‌ఛార్జ్  విధింపులో మార్పులేకుండా 15 శాతంగా ఉండనుంది. ఆదాయం రూ. 3.5 లక్షల ఉన్న వారికి పన్ను రిబేటును రూ. 5000ల నుంచి రూ. 2,500కు తగ్గించారు(గతంలో ఇది రూ.5 లక్షలుగా ఉండేది). ట్యాక్స్, రిబేట్‌లలో మార్పుల ఉమ్మడి ప్రభావంతో గతంలో రూ. 3.5 లక్షల ఆదాయంలోపు ఉన్నవారు రూ. 5,150 పన్ను చెల్లించగా.. ఇప్పుడు రూ. 2,575 చెల్లిస్తే సరిపోతుంది.

4)రూ. 5లక్షలలోపు ఆదాయం ఉన్న  వారికోసం సింపుల్‌ వన్‌ పేజీ ఫాంను కొత్తగా పరిచయం చేసింది.  అంటే రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు (వ్యాపార ఆదాయం కాకుండా) సులభమైన ఒకటే పేజ్‌తో పన్ను రిటర్న్‌ దాఖలు చేయవచ్చు. ఈ విభాగంలో మొదటిసారిగా దాఖలు చేసే పన్ను రిటర్న్‌లపై సహజంగానే స్క్రూటినీ ఉండదు. 

Prev postPage Next post

Leave a Reply

*