గొడవతరువాత బండ్ల గణేష్ టాప్ సీక్రెట్ బయటపెట్టిన రోజా! స్పందిచిన రేణు..

సినీ నిర్మాత బండ్ల గణేష్, రోజా మధ్య నిన్న ఓ టీవీ చానల్ లో మాటల యుద్ధం జరిగిన విషయం మనకు తెలిసిందే. వారిద్దరి మద్య వాదనలో, బండ్ల గణేష్ నీ వల్లే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయారు అన్న మాటకు, అసలే ఫైర్ బ్రాండ్ అయిన రోజా… నువ్వు పవన్ కళ్యాణ్ కి పక్కనే ఉండి పక్కలు వేశావా అని అన్నారు. అవును నిన్నే పడుకోబెట్టా..తీసుకెళ్లాను..నీకు తెలియదా అని అన్నారు. ఇలాంటి వాదన వీరి మద్య చాలా దారుణంగా జరిగింది.

ఎక్కువగా మాట్లాడితే, ఒకరి పళ్ళు ఒకరు రాలగొడతాం అని తిట్టూకుంటూ ఉండగా, ఫోన్ కాల్ కట్ అయ్యింది. ఇదిలా ఉంటె,  రోజా తన ట్విట్టర్ ద్వారా… బండ్ల గణేష్ సెల్ ఫోన్ నంబరును తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టారని తర్వాత తీసేసారని, కాని ఇంతలో అది వైరల్ అయ్యిందని వార్తలు వచ్చాయి. కాని ఆ అకౌంట్ రోజాది కాదని అంటున్నారు.

 

ఇంతలో మరో ట్విస్ట్ ఏమిటంటే, రోజా పై పవన్ కళ్యాన్ మాజీ భార్య రేణుదేశాయ్ తీవ్రంగా మండిపడ్డారని, ఎంతో మంది అభిమానించే పవన్ కళ్యాన్ ని రోజా అంతలా మాట్లాడటం బాలేదని, పవన్ గారిని అలా లైవ్ లో వాడు వీడు అని ఎలా అంటారు, అసలు పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చే మనిషి. పవన్ గురించి రోజా అలా మాట్లాడటం చాలా తప్పు.

పవన్ గురించి మాట్లాడడం తప్పు కాదు కాని ఇలా నోటికి వచ్చినట్లు వాడు వీడు అని మాట్లాడం తప్పు. పవన్ ఏరోజు కూడా రోజాని ఒక్క మాట కూడా అనలేదు, కాని రోజా మాత్రం ప్రతిరోజూ పవన్ ని లేని పోని మాటలు అంటుందని అంటూ రేణుదేశాయ్ తీవ్ర స్థాయిలో కోప్పడినట్లు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి కాని మరి ఇది ఎంతవరకు నిజమో ఆమె స్వయంగా స్పందిస్తే తెలుస్తుంది…

Prev postPage Next post

Leave a Reply

*