ఆడియో వేడుకా? లేక మీడియా భజనా??? సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న ప్రశ్నలివే…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కటమరాయుడు ఆడియో వేడుక ఎంతో ఘనంగా నిన్న జరిగిన విషయం మనకు తెలిసినదే. ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఒక రైతుగా ఈ సినిమాలో పవన్ చాలా బాగా చేసారని, ఆయన పంచే స్టైల్ అదిరిందని, సెంటిమెంట్ కూడా చాలా బాగుంటుందని కాటమరాయుడు టీం తెలిపింది. అది ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది.ఈ వేడుకలో ఫాన్స్ ఎంతగానో ఎంజాయ్ చేసారు.

అయితే ఈ వేడుకకు సినీ ప్రముఖులతో పాటు పత్రికా ప్రముఖులు టీవీ 9 రవిప్రకాష్ కూడా వచ్చారు. ఆయన పవన్ కళ్యాణ్ ని, ఆయన రాజకీయ జీవితాన్ని, ఆయన ఆదర్శాలని, ఆయన ధైర్యాన్ని ఎంతగానో కొనియాడారు. ఆతర్వాత బండ్లగనేష్ మాట్లాడుతూ… పవన్ ని పొగిడిన రవిప్రకాష్ ని కూడా పొగిడారు. ఆఖరున పవన్ కళ్యాణ్ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు.అయితే ఈ వేడుకపై సోషల్ మీడియాలో కొంతమంది కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. అవి బాగా హల్చల్ అవుతున్నాయి. అసలు ఈ వేడుక పై కొందరి స్పందన ఎలా ఉందంటే…

అది కాటమరాయుడి ఆడియో వేడుకా లేక, మీడియా భజనా కార్యక్రమమా అని కొందరు అంటున్నారు. రవిప్రకాష్ గారు మాట్లాడుతూ… ప్రత్యేక హోదా గురించి మోసం చేసిన ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారని అన్నారు. అసలు ప్రత్యేక హోదా గురించి ఎంతో మంది, విద్యార్ధులతో సహా నోరు విప్పి పోరాదతుంటే ప్రశ్నించడానికి పార్టీని పుట్టించిన పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు అనే పాయింట్ పై ఎన్ని వార్తలు, ఎంత గోల జరిగిందో మీడియా మరచిపోవడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాగే జగన్ కు సొంత మీడియా ఉండగా, చంద్రబాబు చేతిలో అనేక మీడియాలు ఉన్నాయని, కేసీఆర్ కు కూడా మీడియా సపోర్ట్ బాగానే ఉండటం వలన ఇక ప్రస్తుతం మీడియా అవసరం బాగా పవన్ కి ఉందని, అది మనం బాగా ఉపయోగించుకోవచ్చనే మీడియా ఇలా మాట్లాడిందని మరి కొందరు అంటున్నారు. ప్రత్యక హోదా ఇస్తారు అని టీడీపీ కి ఓటు వెయ్యండి అని చెప్పిన పవన్ కి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయంలో భాగం లేదా అని మరికొందరు, చిన్న ఆడియో వేడుకకే ఎక్కువ మంది వస్తే, కంట్రోల్ చేయడం కష్టం అనే పవన్, ఇప్పుడు రెండు రాష్ట్రాలలో పరిపాలనను ఎలా చేస్తాడని కొందరు, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా రాకపోవడానికి కారణం ఏమిటని ఇంకొందరూ ఇలా ప్రశ్నలతో కాటమరాయుడి ఆడియో వేడుక సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది…

Prev postPage Next post

Leave a Reply

*