ఏబ్యాంకు ఎంత వడ్డీరేట్లు తగ్గింఛాయో తెలుసా?

కొన్ని బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గించాయి. ఏబ్యాంకు ఎంత వడ్డీరేట్లు తగ్గింఛాయో చూద్దాం…

1.ఐసిఐసిఐ బ్యాంకు: ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లను 0.70 శాతం మేర తగ్గించింది. దీంతో ఏడాది కాలపరిమితి కలిగిన బ్యాంకు ఎంసిఎల్‌ఆర్‌ 8.20 శాతానికి తగ్గింది.ఇతర కాల వ్యవధి కలిగిన రుణాలపై కూడా 0.70 శాతం మేర వడ్డీ రేటును తగ్గించినట్టు పేర్కొంది ఐసిఐసిఐ బ్యాంకు.

2.దేనాబ్యాంకు: ఈ బ్యాంకు రుణాలపై ప్రామాణిక వడ్డీ రేటును 0.75 శాతం మేర తగ్గించింది. దీంతో నిధుల వ్యయం ఆధారిత వడ్డీ రేటు (ఎంసిఎల్‌ఆర్‌) 8.55 శాతానికి తగ్గింది. వడ్డీ రేటు తగ్గించిన ఫలితంగా ఎంసిఎల్‌ఆర్‌తో సంబంధం ఉండే గృహ, కారు, ఇతర రుణాలపై వడ్డీ భారం మరింత తగ్గే అవకాశం ఉంది.

౩. కోటక్‌ మహీంద్రా బ్యాంకు: ప్రైవేటు రంగంలోని కోటక్‌ మహీంద్రా బ్యాంకు ఎంసిఎల్‌ఆర్‌ను 0.20 శాతం నుంచి 0.45 శాతం వరకు తగ్గించింది. ఏడాది కాల వ్యవధి కలిగిన రుణాలపై వడ్డీ రేటును 9.20 శాతం నుంచి 9 శాతానికి తగ్గించింది. అదే విధంగా మూడు నెలలకాలానికి ఎంసిఎల్‌ఆర్‌ను 0.45 శాతం తగ్గించి 8.40 శాతానికి, 2, 3 ఏళ్ల కాలానికి 9.25 శాతం నుంచి 9 శాతానికి తగ్గించినట్టు తెలిపింది కోటక్‌ మహీంద్రా బ్యాంకు. నెల రోజులు, మూడు నెలల ఎంసిఎల్‌ఆర్‌ వరుసగా 8.25 శాతం, 8.40 శాతానికి తగ్గింది. తగ్గించిన వడ్డీ రేట్లు జనవరి ఒకటో తేదీ నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది ఆ బ్యాంక్.

4.ఆంధ్రాబ్యాంకు: ఈ బ్యాంకు ఏడాది కాలవ్యవధి కలిగిన రుణాలపై ఎంసిఎల్‌ఆర్‌ను 9.45 శాతం నుంచి 8.65 శాతానికి తగ్గించింది. వివిధ కాల వ్యవధుల (నెల రోజులు, మూడు నెలలు, ఆరు నెలలు) ఎంసిఎల్‌ఆర్‌ ను కూడా 0.80 శాతం తగ్గించింది ఆంధ్రాబ్యాంకు.

5.ఒబిసి : ఈ బ్యాంకు ఎంసిఎల్‌ఆర్‌ను 0.85 శాతం తగ్గించింది. దీంతో బ్యాంకు వడ్డీ రేటు 8.60 శాతానికి చేరింది. తగ్గించిన వడ్డీరేట్లు ఇవాల్టి నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది ఆ బ్యాంకు.

6.బంధన్‌ బ్యాంక్‌: బంధన్‌ బ్యాంకు బిపిఎల్‌ఆర్‌ను 1.48 శాతం తగ్గించింది. దీంతో బ్యాంకు వడ్డీ రేటు 10.52 శాతానికి చేరుకుంది. లక్ష రూపాయల వరకు రుణంపై ఈ బ్యాంకు వడ్డీ రేటు 19.90 శాతం నుంచి 18.52 శాతానికి తగ్గింది. నిధుల వ్యయం తగ్గినపుడు ఆ మేరకు కస్టమర్లకు ప్రయోజనాన్ని కల్పిస్తున్నట్టు బంధన్‌ బ్యాంక్‌ ఎండి, సిఇఒ చంద్రశేఖర్‌ ఘోష్‌ తెలిపారు. కరెంట్‌, సేవింగ్స్‌ ఖాతాల (కాసా) డిపాజిట్లు 27 శాతం పెరిగి 19,000 కోట్ల రూపాయలకు చేరినట్టు ఆయన చెప్పారు.

Prev postPage Next post

Leave a Reply

*