పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి బాహుబలి లో ఆ సీన్ రాసా

బాహుబలి 2 సినిమా ఎలా ఉంది అనే బదులు, ఆ సినిమా టిక్కెట్లు ఎలా దొరుకుతాయని  అడుగుతున్నారు ప్రపంచమంతా ఒకరినొకరు. అంత ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు రాజమౌళి. ఇంత గొప్ప సినిమాకి కథని అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక ఆశక్తికరమైన విషయం తెలిపారు.

‘‘బాహుబలి-2 ఇంటర్వెల్ గురించి బుర్ర బద్దలు కొట్టుకున్నాం. ఇంటర్వెల్ సీన్లో భళ్లాల దేవుడు రాజ్యానికి అధిపతిగా పట్టాభిషిక్తుడు అయ్యే సమయంలో.. రాజ్యంలోని ప్రజలు బాహుబలి మీదే విశ్వాసంతో ఉంటారు. అది చూసిన భళ్లాలదేవుడు ఈర్ష్యతో ఊగిపోతుంటాడు. అయినా దానిని స్క్రీన్ పై ఎలా చూపాలి అని చాలా సతమతమయ్యమన్నారు.

అలాంటి సమయంలో టీవి లో ఏదో సినిమా ఆడియో వేడుక వస్తుంది. ఆడియో ఫంక్షన్‌కు పవన్ హాజరు కాలేదు కానీ… అక్కడ మాత్రం పవన్ కల్యాణ్ నామ జపంతో మార్మోగిపోయింది. పవన్ అన్న పేరు వచ్చినప్పుడల్లా అభిమానులు హోరెత్తిపోయారు. అది చూస్తే స్టేజీ మీద ఉన్నవారికెవరికైనా అసూయ కలగాల్సిందే. అదే, మా సినిమా ఇంటర్వెల్‌కు సరిగ్గా సరిపోతుందని భావించి కథను అల్లేశాం. అలా బాహుబలి-2 ఇంటర్వెల్‌కు పవన్ స్ఫూర్తిగా నిలిచారు’’ అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.

Prev postPage Next post

Leave a Reply

*