బాహుబలి2 లో సుబ్బరాజు పాత్ర లీక్… అదిరిపొయిందంట

రాజమౌళి సృష్టించిన బాహుఅలి సినిమాకి సంబంధించి ప్రతీది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది  సినీ అభిమానులకు. బాహుబలి లో నటించిన ప్రతీ ఒక్కరుకి మంచి పేరు వచ్చింది. అయితే ప్రభాస్‌, రాణాలతో సమానంగా పేరు తెచ్చుకున్నాడు ‘కాలకేయ’ పాత్రలో నటించిన ప్రభాకర్‌. ఎంతగా పేరు తెచ్చుకున్నాడంటే.. .. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో అతని పేరును ‘కాలకేయ’ ప్రభాకర్‌ అనే వేస్తున్నారు.

ఇప్పుడు బాహుబలి 2 లో అంతటి గొప్ప పాత్ర చేయబోతున్నాడంట సుబ్బరాజు. అసలు ‘బాహుబలి’ సినిమాలో సుబ్బరాజు ఉన్న విషయం చాలా మందికి తెలియనే తెలియదు. కానీ, ‘బాహుబలి-2’ ట్రైలర్‌ లాంఛ్‌ చేసినపుడు సుబ్బరాజు కూడా వేదికపై కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రెండో భాగంలో సుబ్బరాజు అదిరిపోయే పవర్‌ఫుల్‌ విలన్‌ పాత్రను దక్కించుకున్నాడట. మరి అది చూడాలంటే బాహుబలి 2 కోసం వేచి చూడాల్సిందే.

Prev postPage Next post

Leave a Reply

*