శ్రీరెడ్డి ప్రూఫులతో సహా మరో లీక్!

శ్రీరెడ్డి పేరు ఇప్పుడు ఎంతగా పాప్యులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగు నటీమణులకు అవకాశాలు ఇవ్వడం లేదని, అవకాశాలు ఇస్తామని ఆశ చూపించు, వాడుకుని వదిలేస్తున్నారని ఆమె ఆరోపించి దానిపై పోరాటం మొదలు పెట్టింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తెలుగువాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చేవరకు ఊరుకునేడి లేదని, ఆమె ఎన్నుకున్న రీతిలో పోరాటం చేస్తుంది.

అయితే ఈమె పోరాటానికి… ఎన్నుకున్న విధానం కరెక్ట్ కాదని అనేకమంది కామెంట్స్ చేస్తున్నారు. అర్ధనగ్నంగా నడిరోడ్డు పై ఆమె చేసిన నిరసనను అనేకమంది వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటె శ్రీరేడ్డి లీక్స్ అని, సోషల్ మీడియా ద్వారా పలువురి భాగోతాలు లీక్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఇండస్ట్రీలో పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు హీరోయిన్లతో చేస్తున్న దారుణాలు అంటూ… ఇండైరెక్ట్ బయట పెట్టింది.

తాజాగా మరో వ్యక్తికి సంబంధించిన విషయాలు ప్రూఫులతో సహా లీక్ చేసింది. ఏదైనా చేసుకుని బ్రతకొచ్చుకదా అన్న వారికి ఇది నా సమాధానం అంటూ ఈసారి ఇతని గురించి లీక్ చేసింది. యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయిన వైవా హర్ష గురించి శ్రీరెడ్డి ఓ పోస్టు పెట్టారు.

షార్ట్ ఫిలింస్‌లో విషయంలో హెల్ప్ అడిగినందుకు అతడు ఎలా ప్రవర్తించాడో వెల్లడిస్తూ…. వాట్సాప్ చాటింగ్ విషయాలను ఆమె విడుదల చేశారు. పెద్ద చాన్స్, చిన్న చాన్స్ అని ఏమిలేదు. ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి ఎదురవుంది అని తెలిపింది. అందుకే ఎంతమంది నన్ను బెదిరించినా, నా పోరాటం ఆగే ప్రశక్తి లేదు అని అంటుంది…

Prev postPage Next post

Leave a Reply

*