సర్దార్ ఫలితంతో బెంగ పెట్టుకున్న మహేష్ – ఆల్లు ఆర్జున్ ? ఎందుకంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో ఇచ్చిన షాక్ తో టాలీవుడ్ షేక్ అయిపోతోంది. బడా హీరోలంతా ఈ దెబ్బకు కాన్ఫిడెన్స్ ను పక్కనబెట్టి గ్రౌండ్ లెవల్ కు వచ్చి ఆలోచించడం మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. త్వరలోనే థియేటర్లలోకి రానున్న బ్రహ్మోత్సవం సినిమా కోసం ప్రిన్స్ మహేష్ బాబు.. చాలా కష్టపడుతున్నాడు. అయితే.. ఈ సినిమాలో కొంత భాగం మహేష్ కు నచ్చలేదని ఇప్పటికే గుసగుసలు వినిపించాయి.

ఇప్పుడు సర్దార్ సినిమా రిలీజ్ తర్వాత.. ప్రిన్స్ ఆలోచనలో మరింత మార్పు వచ్చిందట. ఎలాగైనా.. శ్రీమంతుడును బీట్ చేసే సినిమాగా బ్రహ్మోత్సవం ఉండాలన్న టార్గెట్ తో.. మహేష్ మరింత అలర్ట్ గా పని చేస్తున్నాడని తెలుస్తోంది. సర్దార్ లాంటి ఫలితమే వస్తే.. అది తన కెరీర్ కు పెద్ద మైనస్ గా మారే ప్రమాదం ఉందని భావిస్తున్నందునే.. మహేష్ ఇంతలా జాగ్రత్త పడుతూ సీన్ టు సీన్ ఎడిట్ చేయిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక.. సరైనోడుగా జనంలోకి వచ్చేందుకు సిద్ధమైన అల్లు అర్జున్ కూడా.. సినిమా విషయంలో తన తండ్రి అల్లు అరవింద్ మాస్టర్ బ్రెయిన్ ను ఉపయోగించుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంతైనా సొంత బ్యానర్.. గీతా ఆర్ట్స్ లో సినిమా కాబట్టి.. అల్లు ఆ మాత్రం శ్రద్ధ పెడతాడని తీసి పారేసే విషయం కాదిది. సర్దార్ లాగా తన కొడుకు సినిమా బేజార్ అవ్వొద్దన్న లక్ష్యంతో.. సరైనోడును సరిగ్గా థియేటర్ ట్రాక్ ఎక్కించేందుకు అల్లు వారు కాస్త ఎక్కువే కష్టపడుతున్నట్టు ముచ్చట్లు జోరందుకున్నాయి.

సర్దార్ గబ్బర్ సింగ్ ఫెయిల్యూర్ తో పవన్ కెరీర్ కు ఎంత నష్టమన్నదీ.. ఎవరూ అంచనా వేయడం లేదు. ఎందుకంటే.. ఈ విషయం గతంలో కలిసిపోయింది. కానీ.. ఆ సినిమా ప్రభావం బడా హీరోల కొత్త ప్రాజెక్టులపై పడుతుండడమే.. అందరినీ ఆకర్షిస్తోంది.

Prev postPage Next post

Leave a Reply

*