టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పుడు క్యూట్ కపుల్ ఎవరంటే, నాగచైతన్య సమంతా అని అందరూ చెబుతారు. ఇక కోడలిగా సమంత అంటే నాగ్ కి చాలా ఇష్టం అన్న సంగతి కూడా తెలిసినదే. ఇక నాగార్జున భార్య అమల కూడా ఎంత మంచిదో, మూగ జీవులను ఎంత ప్రేమగా పెంచుతుందో తెలిసినదే. తన తల్లికి మూగ జీవులు అంటే ఇష్టం అని చైతూ కూడా ఒక పెట్ ని పెంచాడంట.
నాగచైతన్య పెంచుతున్న కుక్క పేరు లియో. అదంటే చైతూకి చాలా ఇష్టం. చైతు పెళ్లి తరవాత లియోని సమంతా కూడా అంతే ఇష్టపడింది. లియో కి సమంతా అన్నా కూడా అంతే ఇష్టం అట. సమంత షూటింగ్ లో లేట్ అయ్యి ఇంటికి టైం కి రాకపోతే, బెంగగా ఎదురు చూస్తూ ఉంటుందంట.
అందుకే సమంత లియో గురించి ఒక పోస్ట్ పెడుతూ… లియో యూ ఆర్ మై సెకండ్ సొల్ మేట. విత్ లవ్ అని పెట్టింది. దీనిని బట్టి, సమంత నాగాచైతన్యనే కాదు, నాగా చైతన్యకు సంబంధించిన అన్నిటిని అంతగా ఇష్టపడతుందని అర్ధం అవుతుంది…
Related posts:

















