రంగస్థలం రివ్యూ…సూపర్ సీన్స్ ఇవే…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా,సమంత హీరోయిన్ గా  సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రంగస్థలం’ సినిమా రిలీజ్ అయ్యింది. పల్లెటూరి వాతావరణంలో, చెర్రీ గత సినిమాలకు భిన్నంగా వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దేవీ శ్రీ సంగీతం అందించిన మ్యూజిక్ ఆల్బమ్, ట్రైలర్‌లోని సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు రీచ్ అయ్యిందో తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే…

కథ… ఈ సినిమా ఒక పల్లెటూరిలో మొదలవుతుంది. రంగస్థలం అనే గ్రామంలో 1980 లో మొదలవుతుంది. రామ్ చరణ్ చిట్టి బాబుగా సైకిల్ నడుపుతూ సినిమాలో ఎంట్రీ ఇస్తాడు. ప్రకాష్ రాజ్ ముక్యమైన పాత్రలో నటించాడు. కొన్ని సన్నివేశాలు తరవాత సినిమా ఫ్లాష్ బ్యాక్ లో కి వెళ్తుంది.  ఆ గ్రామనికి అద్యక్షుడు జగపతిబాబు. చిట్టిబాబు అన్న గా ఆది, తల్లితండ్రులుగా నరేష్ రోహిణి చేసారు. చిట్టిబాబు మొదటి చూపులోనే రామలక్ష్మి సమంతకు పడిపోతాడు.

గ్రామంలో జరిగే అన్యాలకు ఆది ఎదురుతిరుగుతాడు. ఆ తరవాత జగపతి బాబు మనుషులతో చరణ్ కు ఫైట్ జరుగుతుంది. ఆది ప్రసిడెంట్ గా పోటీ చెయ్యాలని అనుకుంటాడు. చరణ్ అతనికి అండగా ఉంటాడు. కాని కొన్ని అనుకోని ట్విస్ట్ లు వలన అన్నదమ్ములు ఇద్దరూ విడిపోతారు. ఆ తరవాత ఫ్లాష్ బ్యాక్ పూర్తి అవుతుంది. అసలు సినిమాలో అన్నదమ్ములు విదిపోవలసిన అవసరం ఏం వచ్చింది? ఫ్లాష్ బ్యాక్ అయిపోయి రెండు సంవత్సరాల తరవాత కూడా బయటపడని ఆ ట్విస్ట్ ఏమిటి? చివరికి ఏమౌతుంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే…

సినిమా ఎలా ఉందంటే…

సినిమా లో రామ్ చరణ్ పాత్ర, నటన అద్భుతం అని చెప్పవచ్చు. చెవిటి వాడిగా చరణ్ చాలా బాగా నటించాడు. ఇక సమంత న్యాచురల్ పల్లెటూరి అమ్మాయిగా చాలా బాగా అంటించింది. జగపతిబాబు, ఆది కూడా ఎవరి పాత్రలకు వాళ్ళు చాకటి పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ సినిమా మొత్తం కామిడి యాక్షన్ తో చాలా బాగుంటుంది. సెకండ్ ఆఫ్ కొంచెం లాగినట్టు అనిపిస్తుంది. కాని సినిమా క్లైమాక్స్ ముందుకు వచ్చాక మంచి ఊపు అందుకుంటుంది. క్లైమాక్స్ అదిరిపోతుంది. ఫోతగ్రఫీ, మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ పాయింట్స్. మొత్తం మీద రామ్ చరణ్ కి ఒక మంచి హిట్ ఇచ్చాడు సుకుమార్…

Prev postPage Next post

Leave a Reply

*