ఈ నెల 30 వ తేది విడుదుల అవుతున్న ఆ సినిమాలో రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో…

ఈ నెల 30వ తేదీన హైపర్,  ‘ఎమ్.ఎస్. ధోని’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న సంగతి మనదరికి తెలిసిందే. ఇందులో ఒక సినిమాలో రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడని వార్త వచ్చింది. ఈ విషయాన్ని చివరివరకు సస్పెన్స్ గా కొనసాగించి ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందున అధికారికంగా ప్రకటిస్తారు అని ఫిలింనగర్ టాక్. వరస అపజయాలతో ఉన్న చరణ్ కు ఈ పాత్ర మంచి క్రేజ్ ని తెచ్చిపెడుతుందని అనుకుంటున్నారు.

ఈవార్తలు ఇప్పటికే మెగా కాంపౌండ్ దృష్టికి వెళ్ళినా ఇంతవరకు ఖండించకపోవడం వలన, మూవీలో చరణ్ ప్రత్యేక పాత్ర ఖాయం అన్న హడావిడి మొదలైంది. ఇంతకీ ఆ పాత్ర ఏమిటంటే… ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం రామ్ చరణ్ ‘ఎమ్.ఎస్. ధోని’ సినిమాలో ధోని పాత్రను పోషిస్తున్న సుశాంత్ పక్కన సురేష్ రైనా గా కనిపించబోతున్నాడు అని టాక్. మరి ఇది ఎంత వరకు నిజం అనేది అధికారికంగా చెప్పే వరకు సస్పెన్స్ లోనే ఉంటుంది.

 

Prev postPage Next post

Leave a Reply

*