రాజశేఖర్ గరుడ వేగ రివ్యూ… ఆసీన్స్ అదిరిపోయాయి

నటీనటులు: డా. రాజశేఖర్, పూజ కుమార్, అరుణ్ అదిత్, కిషోర్, శ్రద్ధ దాస్, నాజర్, ఆలి, సన్నీ లియోన్ (స్పెషల్ సాంగ్), రవి వర్మ, పోసాని, ప్రిద్వి, షాయాజీ షిండే.

సినిమాటోగ్రఫి : అంజి, సురేష్, శ్యాం ప్రసాద్, Gika Chelidze, Bakur Chikobava

ఎడిటింగ్ : ధర్మేంద్ర కాకరాల

కథ, : ప్రవీణ్ సత్తారు, నిరంజన్ రెడ్డి

కధనం, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు

సంగీతం : శ్రీ చరణ్ పాకాల, Bheems Cecireleo

నిర్మాత : M. కోటేశ్వర రాజు

గత కొంతకాలంగా సినిమా హిట్స్ లేకుండా ఉన్న హీరో రాజశేకర్ సినిమా  గరుడ వేగ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రాజశేకర్ కు ఎంత సక్సెస్ ఇవ్వబోతుందో తెలియాలంటే తెలియాలంటే కథలోకి వెళ్దాం…

కథ:

శేఖర్ (డా. రాజశేఖర్) NIA (నేషనల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ) అధికారి. ఎప్పుడు ఆఫీస్ పనులతో బిజీ గా వుండటం వల్ల భార్య విడాకులు కోరుతుంది. శేఖర్ ఇకనుంచి ఫ్యామిలీ తో టైం గడుపుతానని మాటిస్తాడు. ఇంతలో జరిగిన చిన్న కార్ యాక్సిడెంట్ లో శేఖర్ ఒక ప్రొఫెషనల్ snyper తో గొడవ పడతాడు. శేఖర్ ఇంటికి వచ్చి టీవీ లో ఒక ముసలామె అనుమానాస్పదం గా చనిపోవడం చూసి, snyper పై అనుమానం వస్తుంది. వాళ్ళ టీం తో కలిసి snyper ని పట్టుకునే ప్రయత్నం లో snyper చనిపోతాడు. ఈ హత్య వెనుక తెలియని ఇంకో మిస్టరీ ఉంది అని తెలుసుకుంటాడు. ఆ మిష్టరీ ఎలా తెలుసుకున్నాడో తెలియాంటే సినిమా చూడాల్సిందే..

సినిమా ఎలా ఉందంటే…

ఈ సినిమా గురించి రాజశేకర్ ఎంత కష్టపడ్డాడో కనిపిస్తుంది. ఈ కథకి కధ కి రాజశేఖర్ టైలేర్ మేడ్ హీరో. యాక్షన్ సీక్వెన్స్ లు చాలా చక్కగా లాజిక్ మిస్ కాకుండా తీయగలిగాడు దర్శకుడు. నాజర్, పోసాని, షాయాజీ షిండే, రవి వర్మ వాళ్ళ పాత్రలు బాగానే ఉన్నాయి. హీరోయిన్ సినిమాకి తగ్గట్టు గ్లామర్ అందించలేకపోయింది. సినిమా మొత్తం ఒకే ఇన్వెస్టిగేషన్ మీద చూపించడం వలన ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా, ప్రవీణ్ సత్తారు ప్రతి సీన్ చాల క్వాలిటీ తో తీసాడు. సన్నీ లియోన్ సాంగ్ సూపర్బ్ గా వచ్చింది మాస్ ని ఈ సాంగ్ ని ఎంతో ఎట్రాక్ట్ చేస్తుంది అనడం లో ఏమాత్రం సందేహం లేదు. ఈ సినిమా కి సినిమాటోగ్రఫి సూపర్బ్ గా సెట్ ఐంది. కాని రాజశేకర్ ఏజ్ కొంత వరకు సినిమా మైనస్ పాయింట్ అయ్యింది. హీరోయిన్ కూడా హాలివుడ్ రేంజ్ లో తీసిన ఈ సినిమాకి సెట్ అయినట్టు అనిపించలేదు. మరి ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉంటుందో చూడాలి. రాజశేకర్ పట్టుదల, కష్టం మాత్రం సినిమాలో కనిపిస్తుంది. ఈ సినిమా కచ్చితం గా డా. రాజశేఖర్ కి లాస్ట్ 15 years లో  బెస్ట్ మూవీ. కాని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి…

Prev postPage Next post

Leave a Reply

*