పవర్ స్టార్ 26 వ సినిమా మైత్రీ మూవీస్ తో …

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం, ఆయన మాట కోసం, ఆయన చేసే పని కోసం ఆయన ఫాన్స్ ఎంతగా పరితపిస్తూ ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. మాటల మాంత్రికుడు త్రివిక్రం తో పవన్ కళ్యాణ్ 25వ మూవీ అజ్ఞాత వాసి సినిమ, ఈ పండక్కి మన ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో కీర్తీ సురేష్, అనూ ఇమాన్యుయేల్ హీరోయిన్స్ గా పవన్ సరసన నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు అభిమానులు.

ఈ సినిమా మొదలవడానికి ముందు పవన్ మీడియాతో మాట్లాడుతూ…ఈ సినిమా తరవాత తాను పూర్తిగా రాజకీయాలలో బిజీ అవుతానని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గరకి వస్తున్న తరుణంలో పవన్ ఇంక సినిమాలు చెయ్యరు అనే ప్రచారం సాగింది. దీనితో పవన్ అభిమానుల్లో ఒకరకమైన బాధ మొదలయ్యింది. రాజకీయల రీత్యా పవన్ ప్రజల దగ్గరకు ఎంత వెళ్ళినా కూడా, అభిమానులకు మాత్రం ఎప్పుడు బాగా దగ్గరగా ఉండేది, సినిమాల ద్వారానే.

2019 లో వచ్చే ఎన్నికల కోసం పవన్ ఇప్పుడే సినిమాలకి  సెండాఫ్ చెప్పేయడం, ఎవరికి  ఎలా ఉన్నా… ఆయనను, ఆయన సినిమాలను అభిమానించే అభిమానులకు మాత్రం చాలా బాధగానే ఉండటం తో పాటు, ఆయనను మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు పవన్ ఫాన్స్ కి పండగ లాంటి వార్త ఒకటి ఫిలిం నగర్ లో వినిపిస్తుంది.  మైత్రీ మూవీస్  నిర్మించే చిత్రం కోసం గతంలోనే పవన్ అడ్వాన్స్ తీసుకున్నాడు.. అయితే ఇక మూవీలు చేయనని అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసినట్లు వార్తలు వచ్చాయి.. అయితే ఈ అడ్వాన్స్ తిరిగి మైత్రీ మూవీస్  తీసుకోలేదని, ఎప్పుడు వీలైతే అప్పుడే మూవీ చేయమని కోరినట్లు సమాచారం.

అయితే పవన్ ఎంత బిజీగా ఉన్నారో అందరికి తెలిసిన విషయమే. కాని ఈ సినిమాని కందిరీగ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్, పవన్ విలువైన సమయాన్ని వృధాకాకుండా…శరవేగంగా కేవలం 2 నెలల్లో పవన్ షూటింగ్ షార్ట్ పూర్తి  చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైత్రీ మూవీస్  టీమ్ కందీరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ తో ఒక కథను ఆల్రెడీ అద్భుతంగా తీర్చిదిద్దినట్టు ఫిలిం నగర్ లో  వార్తలు వస్తున్నాయి. ఈసినిమాలో అటు సెంటిమెంట్, ఇటు పవన్ పవర్ కి తగ్గ హీరోయిజం కలగలిపి అదిరిపోయే కాన్సెప్ట్ రెడీ అవుతుందని వార్తలు వస్తున్నాయి. అజ్ఞాత వాసి తో పవన్ సినిమాలకు అజ్ఞాత వాసి అవుతాడని అనుకుంటున్న సమయంలో ఈ 26 వ సినిమా వార్త పవన్ అభిమానులకు నిజంగా ఆనందకరమైన వార్త అని అంతా అనుకుంటున్నారు.

Prev postPage Next post

Leave a Reply

*