పవన్ కళ్యాణ్.. అంత పని చేశాడా?

ఎవరి మాటా వినడు. తనకు నచ్చిందే చేస్తాడు. నమ్మిందే ఫాలో అవుతాడు. అందుకే.. టాలీవుడ్ హీరోలు అందరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నిలుస్తాడు. ఫ్యాన్ ఫాలోయింగ్ కు… హిట్లు, ఫ్లాప్ లకూ అతీతంగా కూడా తనదైన స్థానం సంపాదించుకున్న హీరో పవన్. కానీ.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విషయంలో మాత్రం.. పవన్ తన మార్గాన్ని కాస్త మార్చినట్టే కనిపిస్తోంది.

ఈ మధ్య ట్వీట్లతో సంచలనం సృష్టిస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాపైనా ట్వీట్లు వదిలాడు. ఈ సినిమా ఫ్లాప్ కావడం ఖాయమన్న రీతిలో కామెంట్లు చేయడమే కాకుండా.. ఇలాంటి సినిమాతో బాలీవుడ్ లో ఎంత మాత్రం అడుగు పెట్టొద్దు అంటూ.. సలహా కూడా వార్నింగ్ లా ఇచ్చేశాడు.

ఈ ఇష్యూతో పాటుగా… రీసెంట్ గా రిలీజైన ఆడియో, ట్రయిలర్ కూడా జనాన్ని అంతగా ఆకట్టుకోలేదు అన్న మాట వాస్తవం. అందుకే.. పవన్ ఓ డేరింగ్ నిర్ణయానికి వచ్చేశాడట. ఏప్రిల్ 8 న సినిమా రిలీజ్ చేస్తున్నాం అని ఇన్నాళ్లూ ప్రకటించిన యూనిట్.. పవన్ డెసిషన్ తో బ్యాక్ స్టెప్ తీసుకుందట. అవసరమైతే.. మే నెలలో సినిమా రిలీజ్ చేద్దామన్న నిర్ణయానికి.. సర్దార్ గబ్బర్ సింగ్ యూనిట్ వచ్చినట్టు తెలుస్తోంది.

సినిమాలో.. కనీసం 20 నిమిషాలు రీ షూట్ చేయించాలని.. అవసరం అనుకున్న చోట తన క్రియేటివ్ టీమ్ తో.. మళ్లీ కాన్సెప్ట్ క్రియేట్ చేసి.. సినిమాకు కొత్తదనం తీసుకువచ్చే ప్రయత్నం పవన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇదంతా… నిజమే అయితే.. థియేటర్లలో సర్దార్ సందడి చేయడానికి మరింత టైమ్ పట్టడం ఖాయమని.. ఫిల్మ్ నగర్ జనాలు మాట్లాడుకుంటున్నారు.

Prev postPage Next post

Leave a Reply

*