అజ్ఞాతవాసి లో వెంకటేష్ పాత్ర రివీల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న అజ్ఞాతవాసి సినిమా పై భారీ అంచనాలతో పవన్ ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టీజర్, ఆడియో సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 2018 సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా, మంచి సూపర్ డూపర్ హిట్ కోడతుందని, పండగని డబల్ పండుగ చేసుకోవాలని పవన్ ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా లో ఫేమస్ అయిన పాట కొడకా కోటేశ్వరా అనే పాట వీడియో మేకింగ్ ని నూతన సంవత్సర కానుకగా మరియు ట్రైలర్ ని జనవరి 4 లేక 5 తేదీల్లో విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నారు చిత్ర యూనిట్. 

ఈ సినిమాలో వెంకటేష్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. గోపాల గోపాల తో మంచి ఫేం కి వచ్చిన ఈ కాంబినేషన్ మళ్ళీ కలిసి నటిస్తుంటే, వెంకటేష్ అభిమానులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో వెంకి పాత్ర ఏమిటనే దాని పై అనేక వార్తలు వచ్చాయి. పవన్ మేనమామ పాత్రలో ఓ కామెడీ సీన్ లో వెంకటేశ్ దర్శనమివ్వబోతున్నాడని పుకార్లు షికారు చేశాయి. 

అయితే తాజాగా ఆ సినిమాలో వెంకటేశ్ 4 నిమిషాల పాటు ఓ యాక్షన్ సీన్ లో తళుక్కుమనబోతున్నాడని తెలుస్తోంది. వెంకీ – పవన్ ల మధ్య ఆ ఫైట్ సీన్ సినిమా మొత్తానికే హైలైల్ కానుందట. ఈ యాక్షన్ సీన్ పవన్ మార్క్ లో ఉంటుందాలేక త్రివిక్రమ్ తరహాలో ఫన్నీగా ఉంటుందా అన్నది తెలియాలి.

Prev postPage Next post

Leave a Reply

*