నమ్మకం అందుకే కుదిరిందంట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రం ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. దీని తారవాత తమిళ సినిమా రీమేక్ ఎ.ఎం.ర‌త్నం నిర్మాత‌గా చేస్తున్నట్టు తెలుస్తుంది. దాని తరవాత పవన్, దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో ‘మైత్రి మూవీస్’ ప్రొడక్షన్ లో చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

సంతోష్ శ్రీనివాస్ తన మొదటి చిత్రంతోనే మంచి హుషారు, కమర్షియల్ సినిమా తియ్యగల డైరెక్టర్ అని అనిరూపించుకున్నాడు. అయితే రెండవ సినిమా రభస ఓటమిని చవి చూసింది. మూడవ సినిమా హైపర్ తో మెస్సేజ్ ఓరియంటెడ్ సినిమాని కూడా సంతోష్ తీయగలడని నిరూపించాడు. ఈ సినిమా భారీ హిట్ కొట్టకపోయినా, సంతోష్ శ్రీనివాస్ కి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది.

అయితే పవన్ సంతోష్ కి ఎందుకు చాన్స్ ఇచ్చాడు అనే విషయానికి వస్తే… సంతోష్ శ్రీనివాస్ చెప్పిన కథ పవన్ కు నచ్చిందంట. అంతే కాకుండా అవినీతిని ఎదిరించే కాన్సప్ట్ తో హిట్ అయిన తెలుగు సినిమాలు చాలా వరకు రీమేక్ స్టోరీలు మాత్రమె. కాని తెలుగులో తన సొంత కథతో, డైరెక్షన్ తో ఓ ప్ర‌భుత్వోద్యోగి సంత‌కం విలువేంటో చెబుతూ… సంతోష్ శ్రీనివాస్ తీసిన విధానం పవన్ ని ఆకట్టుకుందంట. పేరుకి, సక్సస్ కి, హోదాకి, అయిన వారికి కాకుండా కేవలం ట్యాలంట్ చూసి అవకాశం ఇచ్చే హీరో పవన్ కళ్యాణ్ అని మనందరికీ తెలుసు. అందుకే పవన్ సంతోష్ కి చాన్స్ ఇచ్చాడంట.

Prev postPage Next post

Leave a Reply

*