పవన్ కళ్యాణ్ మీద ఫాన్స్ పిచ్చ కోపంగా ఉన్నారు

మా అన్నయ్య కోసం నేనున్నా.. నేనుంటా.. నేను నిలబడతా.. అంటూ పవన్ కళ్యాన్ మొన్నామధ్యన ”సర్దార్” సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో చాలా విషయాలు చెప్పాడులే. అయితే మెగాస్టార్ 150వ సినిమా లాంచ్ లో పవన్ కనబడకపోయేసరికి.. అభిమానులు మాత్రం హర్టయ్యారు. అంతకంటే పెద్దగా ఇప్పుడు ఇంకా హర్టవుతున్నారు. ఎందుకంటారు? అబ్బే.. ఒక ప్రక్కన సొంత ఐకానిక్ అన్నయ్య ల్యాండ్ మార్క్ సినిమా లాంచ్ కు ఫ్యామిలీ అంతా తరలి వస్తే.. పవన్ మాత్రం రాలేదు కాని.. మరో ప్రక్కన మే 2న జరుగనున్న ”అ..ఆ” ఆడియో లాంచ్ కు మాత్రం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్టుగా రావడం కాస్త బాధపెట్టే అంశమే అంటున్నారు అభిమానులు.

నితిన్ అండ్ త్రివిక్రమ్ కోసం డేటు ఇవ్వగలిగే పవన్ .. తన అన్నయ్య కోసం ఎందుకు ఇవ్వలేకపోయాడు అని వారు ప్రశ్నిస్తున్నారు. పైగా చిరంజీవి ఈ డేట్ గురించి దాదాపు 10 రోజుల ముందే అందరికీ చెప్పారట. అలాంటప్పుడు పవన్ మిస్సవ్వకుండా ఎందుకు ప్లాన్ చేసుకోలేదు అని అడుగుతున్నారు ఫ్యాన్స్. ఇలా చేయడం కారణంగా మెగా ఫ్యాన్స్ కు చిర్రెత్తుకొస్తోందట. సర్లేండి.. ఎవరి ఇష్టం వారిది. హీరోలకు కూడా పర్సనల్ ఇష్టాయిష్టాలు అంటూ ఉండవా ఏంటి? అయినా రేపో ఎల్లుండో పర్సనల్ గ ఇంటికెళ్ళి మెగాస్టార్ కు పూల బొకే ఇచ్చి మరీ పవన్ అభినందించడా ఏంటి..!!

Prev postPage Next post

Leave a Reply

*