జూనియర్  ఎన్టిఆర్ 420 నా? సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్

ఎన్టీఆర్ ఇప్పుడు ‘టెంపర్‌’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతాగ్యారేజ్‌’ వంటి వరుస విజయాలతో మంచి ఉషారుగా ఉండటమే కాకుండా, ఇప్పుడుకెరీర్‌లోనే పీక్‌ స్టేజ్‌లో ఉన్నాడు తారక్. ఈ నేపథ్యంలో ఎన్టీయార్‌ నటించబోయే తర్వాతి సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుందని , ఆ చిత్రానికి ‘420’ అనే టైటిల్ ని పెట్టబోతున్నట్లు వార్త ఒకటి సోషల్ మీడియాలోనూ, మీడియా వర్గాల్లోనూ హల్ చల్ చేస్తోంది. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది కరెక్ట్ గా తెలియదు. ఎందుకంటే… పూరి జగన్నాథ్ ఈ టైటిల్ ని ఎక్కడా అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ ఇదే టైటిల్ ప్రకటిస్తారన్నట్లుగా పేరున్న మీడియా పత్రికలలో సైతం రావటంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.  పూరీ జగన్నాథ్‌ చెప్పిన కథకు ఎన్టీయార్‌ ఓకే చెప్పాడని, ఈ సినిమాలో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌లో తారక్‌ కనబడనున్నాడని అనుకుంటున్నారు.

 

Prev postPage Next post

Leave a Reply

*