‘ఛల్ మోహన్ రంగ’ సినిమా రివ్యూ…

‘ఛల్ మోహన్ రంగ’ సినిమా రివ్యూ…

నితిన్ హీరోగా నటించిన ఛల్ మోహన్ రంగ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ పేర్లు ఇన్వాల్వ్ అయ్యి ఉండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ కి మంచి రేస్పాన్సే వచ్చింది. ఈ సమ్మర్ మొదలు రంగస్థలం మంచి ఓపెనింగ్ ఇచ్చింది. మరి అదే ట్రెండ్ ఈ సినిమాకి కూడా వస్తుందో లేదో తెలియాలంటే సినిమా స్టోరీ లోకి వెళ్దాం…

 

కథ ….

ఈ సినిమా స్టార్టింగ్ హాస్పటిల్ లో మొదలవుతుంది. అక్కడ హీరో (నితిన్) హీరోయిన్ (మేఘా ఆకాష్) ని చూపిస్తారు. తరవాత సినిమా ఫ్లాష్ బ్యాక్  లోకి వెళ్తుంది. ప్రగతి మనియు నరేష్ నితిన్ తల్లితండ్రులు. నితిన్ చిన్నప్పటి సీన్స్ తరవాత పెద్దవాడు అవుతాడు. పెద్దవాడయిన నితిన్ వీసా కి అప్లై చేసుకుంటాడు.

యూఎస్ఏ లో నితిన్ మరియు హీరోయిన్ మేఘా కలుసుకుంటారు. వారిద్దరి మద్య మంచి కెమిస్ట్రీ నడుస్తుంది. తరవాత వాళ్ళిద్దరూ విడిపోతారు. మేఘా ఇండియా వచ్చేస్తుంది. సంజయ్ స్వరూప్ హీరోయిన్ తండ్రిగా చేసాడు. తర్వాత నితిన్ మేఘనాని వెతుక్కుంటూ ఇండియా వస్తాడు. అక్కడ కొన్ని ట్విస్ట్ లు ఉంటాయి. చివరికి ఒక యాక్సిడెంట్ తరవాత, ఫ్లాష్ బ్యాక్ పూర్తి అయ్యి మళ్ళీ హాస్పిటల్ సీన్ లోకి వస్తారు. అసలు నితిన్, మేఘా ఎందుకు విపోయారు? నితిన్ ఇండియా వచ్చిన తరవాత ఏమయ్యింది? చివరికి వీళ్ళిద్దరూ ఎలా కలిసారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే…

సినిమా ఎలా ఉందంటే…

సినిమా నిర్మాణం చాలా బాగా, అందంగా ఉంది. హీరో నితిన్ తన పాత్రకు తను న్యాయం చేసే విధంగా నటించాడు. కొన్ని పాటల్లో డాన్స్ అదరగొట్టాడు. సినిమాలో కామెడి బాగా పండింది. త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ సినిమాలో బాగున్నాయి. తమన్ బ్యాక్రౌండ్ మ్యూజిక్ సినిమా చాలా ప్లస్ అయ్యింది. హీరో హీరోయిన్ మద్య కెమిస్ట్రీ బాగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ సినిమా చాలా ఆశక్తికరంగా సాగుతుంది. సెకండ్ ఆఫ్ పరవాలేదు అనిపించుకుంది. ఎంటర్తైన్మెంట్ కి సినిమా బాగానే ఉంది అనిపించుకుంటుంది. సినిమా రొటీన్ కథే అని అనిపిస్తుంది. మొత్తం మీద దర్శకుడు కృష్ణచైతన్య నితిన్ తో ఈ సమ్మర్ కి ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఇచ్చాడని అనుకోవాలి…

 

 

Prev postPage Next post

Leave a Reply

*