నిఖిల్ “కేశవ”, సూర్య “గజని” కన్నా థ్రిల్లింగ్ గా ఉంది…!

పెద్దనోట్ల రద్దుతో దేశం అల్లకల్లోలంగా ఉన్న సమయంలో రిలీజ్ అయిన సినిమా ఎక్కడికీ పోతావు చిన్నవాడా మంచి హిట్ కొట్టింది. నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా 30 రోజుల్లో 38 కోట్లకు పైగా వసూళ్లను సాధించటంతో పాటు ఈ యంగ్ హీరో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది. దీనితో నిఖిల్ నెక్స్ట్ సినిమాపై అందరికి ఆశక్తి పెరిగింది.దానికి తగ్గట్టుగానే నిఖిల్ తన కెరీర్ ను మలుపు తిప్పిన స్వామి రారా చిత్ర దర్శకుడు సుదీర్ వర్మ దర్వకత్వంలో కేశవ అనే క్రైం థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. ఇప్పటి వరకు వైరీటీ కథలతో సక్సెస్ సాధించిన నిఖిల్ ఇప్పుడు కథ వింటే ఇంకా వెరైటీగా ఉంటుంది.

కథ ప్రకారం నిఖిల్‌ రాజమండ్రిలోని ఓ కాలేజ్‌ స్టూడెంట్‌. అయితే అతనికో సమస్య ఉంటుంది. అందరికీ ఉన్నట్టు కాకుండా అతనికి గుండె కుడివైపు ఉంటుంది. దీంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. కనీసం టెన్షన్‌ పడకుండా: ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకోకూడదు. ఏ మాత్రం టెన్సన్‌ పడినా అతని పరిస్థితి అంతే. అలాంటి వ్యక్తి కొంతమంది మీద పగ తీర్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కనీసం టెన్షన్‌ పడకుండా, కోపం తెచ్చుకోకుండా ఎలా పగతీర్చుకున్నాడన్నదే కథ. వెరైటీ స్టోరీ: అందుకే ఈ సినిమాకు ‘పగ అనే వంటకాన్ని చల్లగా ఉన్నప్పుడు వడ్డిస్తేనే బాగుంటుంది’ అనే ట్యాగ్‌లైన్‌ పెట్టారు. స్టోరీ లైన్మ సూర్య గజనీ కంటే థ్రిల్లింగ్ గా ఉంది కదా , వెరైటీ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నిఖిల్‌ మరో విజయాన్ని అందుకునేందుకు రెడీ అయిపోతున్నాడన్నమాట. 

Prev postPage Next post

Leave a Reply

*