నీదీ నాదీ ఒకే కథ రివ్యూ…హైలెట్స్ ఇవే…

నీదీ నాదీ ఒకే కథ రివ్యూ…హైలెట్స్ ఇవే…
చిత్రం: నీదీ నాదీ ఒకే కథ
నటీనటులు: శ్రీ విష్ణు.. సత్నా టిటస్‌.. దేవీ ప్రసాద్‌ తదితరులు
సంగీతం: సురేష్‌ బొబ్బిలి
ఛాయాగ్రహణం: రాజ్‌ తోట, పర్వీజ్‌ కె
కూర్పు: బి.నాగేశ్వరరెడ్డి
కళ: టి.ఎన్‌.ప్రసాద్‌
నిర్మాత: ప్రశాంతి, కృష్ణ విజయ్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వేణు వూడుగుల
బ్యానర్‌: ఆరాన్‌ మీడియా వర్క్స్‌, శ్రీ వైష్ణవి క్రియేషన్స్‌
సమర్పణ: నారా రోహిత్‌, అట్లూరి నారాయణ రావు

ఈ తరం హీరోలు సినిమా కథను ఎన్నుకునే విధానంలోనే వారి ట్యాలెంట్ చూపిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథలను ఎన్నుకుంటూ కెరీర్ లో ముందుకు వెళ్ళిపోతున్నారు. అలా విభిన్న నేపథ్యాల కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళ్తున్నాడు శ్రీవిష్ణు. ఒక పక్క కథానాయకుడిగా నటిస్తూనే మరో పక్క ఇతర హీరోలతో కలిసి తెర పంచుకునేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. గతేడాది ఆయన నటించిన ‘మెంటల్‌ మదిలో’ ఫీల్‌గుడ్‌ మూవీగా అలరించింది. ఇప్పుడు ‘నీదీ నాదీ ఒకే కథ’ అంటూ మరో విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమా ప్రచారమే ఒక కొత్త దానాన్ని సంతరించుకుంది. ‘మేధావులు, పక్కనవాళ్ల పనిని, పనితనాన్ని చులకనగా చూసేవారు దయచేసి మా సినిమాకు రాకండి. ఇది కేవలం మాకు, మాలాంటి వాళ్లకు సంబంధించిన కథ. ఏ మాత్రం హీరో ఇంట్రడక్షన్‌, ఇంటర్వెట్‌ ట్విస్ట్‌లు, క్లైమాక్స్‌ ఫైట్లు, ఆఖరికి రాహుల్‌ ద్రవిడ్‌ యాడ్‌ కూడా లేని ఒక సామాన్యుడి కథ.. ఇది మా కథ.. మీ కథ..’ అంటూ గమనిక పెట్టి మరీ ప్రచారం చేశారు. తెలుగుప్రేక్షకులు కొత్తదనాన్ని ఎప్పుడు ఆదరిస్తారు. కాని అది వాళ్లకు బాగా కనెక్ట్ అవ్వాలి. మరి ఈ సినిమా ఎలా ఉందొ పై వీడియోలో చూద్దాం…

Prev postPage Next post

Leave a Reply

*