నందమూరి, అక్కినేని కాంబినేషన్ లో మళ్ళీ సెన్సేషనల్ సినిమా!

ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమాలు అంటే ఆరోజుల్లో తెలుగు సినీ అభిమానులకు ఎంతటి అభిమానమో మనందరికీ తెలుసు. ఇద్దరు టాప్ హీరోలు, వారి పాత్రకు మాత్రమె ప్రాధానం ఇచ్చి సినిమాలను చేసేవారు. ఇప్పుడు ఆ వారసులు  బాలకృష్ణ, నాగార్జున కాంబినేషన్లో పౌరాణిక సినిమా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్త ప్రచారంలోకి రావడం అభిమానుల్లో ఆసక్తిరేపింది.

వీరిద్దరి మద్య రిలేషన్ అంతగా లేదని, ఒకరంటే ఒకరికి పడదని అప్పట్లో వార్తలు వినిపిస్తుండటంతో పాటు, మొన్న జరిగిన చైతు రిసప్షణ్ కి బాలయ్య రాకపోవడంతో అది నిజమేనేమో అని చాలామంది అనుకున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఏమిటని అనుకుంటున్నారా? బాలకృష్ణ, నాగార్జున కాంబినేషన్లో ‘నరనారాయణ’ అనే పౌరాణిక చిత్రం చేసేందుకు నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన స్క్రిప్టు వర్క్ చేయిస్తున్నారు.

ఇటీవల రామలింగస్వామి ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ…. నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య కోరికపై నాగార్జున, బాలకృష్ణ కోసం ఈ స్క్రిప్టు రాశానని, ఇద్దరి సంభాషణల కోసం ఎన్నో సమాసాలను వాడామని, ఇటీవలే అది పూర్తయిందని తెలిపారు. ఇటీవలే ఈ ప్రాజెక్టును బాలయ్యకు వివరించానని రామలింగస్వామి తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై ఓ క్లారిటీ వస్తుందని ఆయన వెల్లడించారు. ఇందులో బాలయ్య కృష్ణుడిగా, నాగార్జున అర్జునుడిగా చేస్తారని తెలిసింది. వీరిద్దరూ ఆనాటి కృష్ణుడు ఎన్టీఆర్ ని అర్జునుడు నాగేశ్వరరావు ని గుర్తుకుతెస్తారేమో చూడాలి. మళ్ళీ నందమూరి, అక్కినేని కాంబినేషన్ లో ఇలాంటి సినిమా రావాడం అంటే.. ఆ సినిమా ఒక సెన్సేషన్ సృష్టిస్తుందని అందరూ అనుకుంటున్నారు. మరి ఇంతకీ ప్రాజెక్ట్ ఎంతవరకు మొదలవ్వడానికి అవకాశాలు ఉన్నాయో చూడాలి…

Prev postPage Next post

Leave a Reply

*