‘ఛలో’ మూవీ రివ్యూ మరియు రేటింగ్…

నటీనటులు: నాగ శౌర్య, రష్మిక మండన్న, అచ్యుత్ కుమార్, నరేష్, వైవా హర్ష, రఘు బాబు, ప్రగతి, ప్రవీణ్, సత్య, సుదర్శన్, రాజేంద్రన్ తదితరులు….
పాటలు – భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్
డ్యాన్స్ – రఘు, విజయ్
ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి), తమ్మిరాజు
సంగీతం- మహతి స్వర సాగర్
సినిమాటోగ్ర‌ఫి- సాయి శ్రీరామ్‌
నిర్మాత‌- ఉషా ముల్పూరి,
సమర్పణ – శంక‌ర ప్ర‌సాద్ ముల్పూరి
ద‌ర్శ‌క‌త్వం- వెంకి కుడుముల‌
నాగ శౌర్య తొలి సినిమా ఊహలు గుసగుసలాడే తో మంచి పేరు సంపాదించాడు. ఆ తరవాత అతను దాదాపు 10 సినిమా లు చేసాడు కాని పెద్దగా హిట్ కొట్టినవి ఏమి కనబడలేదు. చూడటానికి బాగుంటాడు, పైగా నటన కూడా బాగానే చేస్తాడు కాని, స్టార్ హీరో గా మాత్రం మారలేకపోతున్నాడు. ‘ఛలో’ సినిమా ట్రైలర్ చూసిన తరవాత ఈసారి నాగసౌర్యాకి మంచి టర్నింగ్ ఉంటుందని అందరూ అనుకున్నారు. మరి ఈ సినిమా నాగసౌర్యాకి ఎంత హిట్ ఇచ్చిందో తెలియాలంటే కథలోకి వెళ్దాం…

కథ…

ఈ సినిమాలో హీరో హరి (నాగ శౌర్య)కు చిన్నప్పటి నుండి కొట్టడం లేదా కొట్టించుకోవడం అలవాటు. అందులోనే అతనికి కిక్ ఉంటుంది. ఇతని తల్లితండ్రులు తల్లి దండ్రులు (ప్రగతి-సీనియర్ నరేష్) ఇతని ప్రవర్తనకు బెంగపెట్టుకుంటారు. తమ కొడుకు ఈ గొడవల జోలికి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చెయ్యాలని ఆలోచిస్తారు. రజనీకాంత్ సినిమాలోని ఓ సీన్‌కు చూసి ఇన్స్‌స్పైర్ అయి గొడవలు ఎక్కువగా ఉండే ఆంధ్ర-తమిళనాడు బార్డర్‌లోని ‘తిరుప్పురం’ అనే ఊరికి పంపిస్తారు.

ఆ ఊర్లో తెలుగు-తమిళ వర్గాలు రోజూ గొడవపడుతూ ఉంటారు. ఇక్కడ రోజు జరిగే గొడవలు చూసైనా గొడవలపై విరక్తి చెంది కొడుకు మారుతాడు అని వాళ్ళు ప్లాన్ వేసి అక్కడుకు పంపుతారు. ‘తిరుప్పురం’ ఊర్లో అడుగు పెట్టగానే హరి తెలుగువాడని తెలిసి అతడిని చంపాలని ప్రయత్నిస్తారు తమిళ వర్గీయులు.

వాళ్ళ నుంచి తప్పించుకేనే సమయంలో తమను శత్రువులుగా భావించే తమిళ వర్గానికి చెందిన అమ్మాయి కార్తీక(రష్మిక మండన్న)ను ప్రేమిస్తాడు. మరి ఆ అమ్మాయిని ఎలా ఒప్పిస్తాడు? అసలు ఆ రెండు ఊర్ల మద్య ఉన్న సమస్య ఏమిటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే…

సినిమా ఎలా ఉందంటే…

నాగాసౌర్య నటన బాగానే ఉంది. బాగానే ఉంది కాని అంతగా కొత్తగా ఏమీ మెప్పించలేకపోయాడు. హీరోయిన్ కూడా బాగానే ఉంది కాని, సినిమా కి అంత ప్లస్ పాయింట్ కాలేకపోయింది. సినిమాలో కామెడి బాగానే ఉంది. సినిమాలో కథ చాల వీక్ గా ఉంది. అనుకున్న కథని దర్శకుడు సరిగ్గా ప్రజంట్ చెయ్యలేకపోయాడు. సెకండ్ ఆఫ్ లో సినిమా పై ప్రేక్షలులు వేసుకున్న అంచనాలకు దర్శకుడు రీచ్ కాలేకపోయాడు. మొత్తం మీద సినిమా యావరేజ్ అనిపించుకుంది…

రేటింగ్…2/5

Prev postPage Next post

Leave a Reply

*