నాలుగవ భార్య రెడీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికీ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. మొన్ననే మరో కొడుకు పుట్టిన సంగతి కూడా తెలుసు. అయితే ఇప్పుడు మరొక కొత్త వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. డాక్టర్‌. నరేశ్‌ వడ్లమాని అనే డాక్టర్ ఆయన అనుభవాన్ని ఇలా వివరించారు.

ఐదారేళ్ల క్రితం 24 ఏళ్ల అమ్మాయిని వాళ్ల తల్లితండ్రులు ఆయన వద్దకు తీసుకువచ్చారంట. ఆ అమ్మాయి ఓ మల్టీ నేషనల్‌ కంపెనీలో ఉద్యోగి. అయితే ఆమె పవన్ కళ్యాణ్ కి వీర అభిమాని అంట. ఓ సందర్భంలో అక్కడికి పవన్‌ కళ్యాణ్‌ రావటం, ఈ అమ్మాయిని చూసి నవ్వటమో ఏదో జరిగిందట. దాంతో…అప్పటి నుంచీ అతను తనను ప్రేమిస్తున్నాడనే భ్రమలో పడిపోయింది. ఆ భ్రమే ముదిరి ఏదేదో ఊహించుకుని విపరీతంగా ప్రవర్తించటం మొదలు పెట్టింది. ‘నేనే కాదు, పవన్‌ కల్యాణ్‌ కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను వదిలేస్తే వాళ్లింటికి వెళ్తాను’ అంటూ గోల చేస్తుంటే ఆ అమ్మాయి తల్లితండ్రులు, డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్లారంట.  

దీనిపై ఆ డాక్టర్ వివరిస్తూ… ఆ అమ్మాయికి ఏడాదిపాటు చికిత్స అందించాం. దాంతో పూర్తిగా నయమై, ఇప్పుడు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో అమెరికాలో ఉంటోంది. అయితే ‘ఎరొటొమేనియా’ చికిత్సతో తగ్గినా తిరగబెట్టే అవకాశాలుంటాయని అన్నారు. సరిగ్గా అలానే ఆ అమ్మాయి జీవితంలో జరిగింది. పిల్లలు కలిగాక వృత్తిగత, వ్యక్తిగత జీవితాల్ని బ్యాలెన్స్‌ చేసే క్రమంలో ఒత్తిడికి లోనై మళ్లీ ‘ఎరొటొమేనియా’కు లోనైంది. ఎప్పుడైతే ఈ వ్యాధి తిరగబెట్టిందో ఆమెకు మళ్లీ పవన్‌ కల్యాణ్‌ గుర్తొచ్చాడు. పవన్ కి ముగ్గురు భార్యలు ఉన్నా, నాలుగవ భార్యగా రెడీ అంటుంది. ఇప్పుడా అమ్మాయిని భర్త చికిత్స కోసం తీసుకురాగా, చికిత్స నడుస్తుందని తెలుస్తుంది . 

డాక్టర్‌. నరేశ్‌ వడ్లమాని,

ఛీఫ్‌ కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌,

కొలంబస్‌ హాస్పిటల్‌, బేగం పేట్‌, హైదరాబాద్‌

ఈ హీరోల కన్నా వాళ్ల భార్యలు ఎంత పెద్దవారో తెలుసా|

ప్రేమకు ఆస్థులు అంతస్తులు, కులం మతం,ఇలా ఏవీ అడ్డురావని ఎన్నో సినిమాలు, ఎన్నో భాషల్లో తీసారు. కాని, రియల్ జీవితంలో ప్రేమకు, పెళ్ళికి వయసు కూడా అడ్డుకాదని నిరూపించారు మన హీరోలు.

ఐశ్వర్యారాయ్… ఈమె నెంబర్ వన్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఆ సమయంలో అభిషేక్ బచ్చన్ తో సినిమాలు చేసింది. అలా వారిద్దరి మద్య ప్రేమ కలిగి పెళ్ళికి దారి తీసింది. అయితే అభిషేక్ కంటే ఐశ్వర్య 3 సంవత్సరాలు పెద్దది. అయినా వీరిద్దరి దాంపత్య జీవితం ఎంతో చక్కగా సాగుతుంది.

రామ్ చరణ్…మన మెగా పవర్ హీరో రామ్ చరణ్ కూడా ఉపాసనాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ మొదట మంచి స్నేహితులు. తరవాత వారి స్నేహం ప్రేమగా మారింది. ఉపాసన 4 సంవత్సరాలు పెద్దది అయినా కూడా , చరణ్ ఇంట్లో అందరిని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు.

మహేష్ బాబు… నమ్రత మిస్ ఇండియా గా సెలక్ట్ అయ్యింది. ఆమె పలు సినిమాలలో కూడా నటించింది. మహేష్ తో కలసి వంశీ సినిమా చేసే సమయంలో వీరిద్దరి మద్య ప్రేమ కుదిరింది. నమ్రత మహేష్ కంటే 3 సంవత్సరాలు పెద్దది. వీరి ప్రేమకి మహేష్ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మరీ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీరు చాల ఆనందంగా  ఉన్నారు.

స్నేహ… మన తెలిగింటి అమ్మాయి అయిన ఈమె తెలుగులో ఎన్నో మంచి చిత్రాలు నటించింది.  ఈమె ఒక తమిల్ సినిమాలో తమిల్ హీరో ప్రసన్న తో కలసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. కాని ప్రసన్న కంటే స్నేహ ఒక సంవత్సరం పెద్దది. అయినా కూడా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

ధనుష్… తమిల్ స్టార్ హీరో ధనుష్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తమిల్ సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ధనుష్ కంటే ఐశ్వర్య పెద్దది. అయినా కూడా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నారు.

Prev postPage Next post

Leave a Reply

*