కృష్ణార్జున యుద్ధం సినిమా రివ్యూ…సేం టు సేం అలానే…

కృష్ణార్జున యుద్ధం సినిమా రివ్యూ…సేం టు సేం అలానే…

నటీనటులు: నాని, అనుపమ పరమేశ్వరన్, రుస్కర్ మీర్, బ్రహ్మాజీ, నాగినీడు తదితరులు

సంగీతం: హిప్‌హాప్ తమిజా

 సినిమాటోగ్రఫి: కార్తీక్ ఘట్టమనేని

 ఎడిటింగ్: సత్య జీ నిడివి:

కథ, దర్శకత్వం: మేర్లపాక గాంధీ

నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది

టాలీవుడ్‌లో  వరస హిట్స్ తో నేచురల్ స్టార్ నాని దూసుకుపోతున్న సంగతి మనకి తెలిసిందే. కేవలం కలక్షన్ల పరంగానే కాకుండా, నటన పరంగా కూడా నాని తన ప్రతిభని ఎప్పటికప్పుడు చూపెడుతూనే ఉన్నాడు. తనదైన నేచురల్ స్టైల్ లో నటిస్తూ ప్రేక్షకుల ఆధరణ పొందుతున్నాడు. ఈరోజు నాని సినిమా కృష్ణార్జున యుద్ధం మన ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందొ తెలియాలంటే కథలోకి వెళ్దాం…

 

కథ…

కృష్ణ (నాని) చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు. ఇతనికి పెద్దగా చదువు రాకా వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అలా సాగుతున్న కృష్ణ జీవితంలోకి రియా (రుస్కర్ మీర్) ప్రవేశిస్తుంది. రియా బాగా చదువుకొన్న అమ్మాయి కావడం, డబ్బున్న కుటుంబానికి చెందడంతో వారి ప్రేమకు పెద్దలు అంగీకారం లభించదు. అందువలన పెద్దవాళ్ళు ఆమెణు హైదరాబాద్ పంపుతారు. ఇక్కడ కృష్ణ స్టోరీ ఇలా ఉంటె…

యూరప్‌లోని ప్రాగ్‌లో నివసించే అర్జున్ (నాని) ఓ రాక్‌స్టార్. అమ్మాయిలంటే అర్జున్‌కు ప్రపంచం. అలాంటి జీవితంలో బతికే అర్జున్‌కు సుబ్బలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్) కనిపిస్తుంది.. సుబ్బలక్ష్మిని తొలిచూపులోనే అర్జున్ ప్రేమిస్తాడు. కానీ అర్జున్ ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె అతడి ప్రేమను తిరస్కరించి హైదరాబాద్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకొంటుంది. ఇద్దరు హీరోయిన్స్ హైదరాబాద్ లో ఒక సమస్యలో చిక్కుకుంటారు. వీళ్ళు ఎలాంటి సమస్యలో చిక్కుంటారు? వీళ్ళను ఇద్దరు హీరోలు ఎలా కాపాడతారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే… ఫస్ట్ ఆఫ్ కొంచెం బాగానే ఉంటుంది. మొత్తం సినిమా నాని భుజాలపై మోసాడు. మాస్ యాక్షన్ బాగానే చేసాడు. కాని, సినిమా కథలో కొత్తదనం లేదు. సినిమా ఇంటర్వెల్ చాలా సాదాగా ఉంటుంది. హీరోయిన్స్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసారు. ఇంటర్వెల్ తోనే సినిమా స్టోరీ మొత్తం అర్ధం అయిపోతాది. ఎప్పుడు ఉండే రోటీన్ కథతో ప్రేక్షకులు కాస్త బోర్ అవుతారు.అంతేకాదు, సెకండ్ ఆఫ్ అయితే కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా ఎప్పుడు చూసినట్టే సేం టు సేం అన్నట్టు అనిపిస్తుంది. నాని లాంటి హిట్ హీరోతో గాంధీ ఇలా తీసాడేటి అనిపిస్తుంది. ఏది ఏమైనా సినిమా యావరేజ్ అనిపించుకుంది…

 

Prev postPage Next post

Leave a Reply

*