చిరు, దాసరి లపై కోటా సంచలన వ్యాఖ్యలు…అలా కక్షకట్టి ఉంటె…

ఇటీవల ప్రముఖ దినపత్రికతో కోటా శ్రీనివాస్ మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై ఒకొనొక సమయంలో దీక్ష చేసిన వివరాలు తెలుపుతూ… సినీ కార్మికుల సంక్షేమం, పరిశ్రమ బాగోగుల కోసం నేను చేపట్టిన దీక్షకు ఎందరో మద్దతు తెలిపారు. కాని తాను దీక్ష చేపట్టడం సీని ప్రముఖులు దాసరి నారాయణరావు, రామానాయుడు, చిరంజీవిల ఆగ్రహానికి కారణమైందని అన్నారు.

ఆ సమయంలో నేను దీక్ష చేయడం దాసరి నారాయణరావు, మరికొందరికి నచ్చలేదు అని వీబీ రాజేంద్రప్రసాద్‌, రామానాయుడు వచ్చి ఇదే విషయాన్ని చెప్పారు. ‘వాడిని అక్కడి నుంచి లేపండి ముందు’ అని ఆయన చాలామందికి ఫోన్లు చేశారట అని అన్నారు. ఆయన  దీక్ష చేపట్టడం వల్ల కోటా పై  చిరంజీవికి కూడా కోపం పెరిగిందని అర్థమైందని అన్నారు. దీక్ష వల్ల చిరంజీవి సినిమాలు, ఆయన నిర్మాతలు తీసిన చిత్రాలు, దాసరి సినిమాల్లో ఆయనకు  అవకాశాలు తగ్గాయని తెలిపారు.

 అయితే కృష్ణ, శోభన్‌బాబు, రాజేంద్రప్రసాద్‌, నరేశ్‌ లాంటి హీరోల సినిమా అవకాశాలు చేతికి దక్కడంతో ఏ రోజు షూటింగ్‌ లేక ఖాళీగా కూర్చోలేదని, వారి ప్రభావం ఆయన పై  పడలేదని  చెప్పారు.అయితే  వారిలానే పరిశ్రమ మొత్తం కక్ష కట్టి ఉంటే నా పరిస్థితి దారుణంగా ఉండేదేమో అని ఆన్నారు. దీక్ష ముగిసిన తర్వాత హైదరాబాద్‌లో చాలా సినిమాలు మొదలయ్యాయి. పరిశ్రమ కూడా బాగా నిలదొక్కుకున్నది. చాలా మంది హీరోలకు అవకాశాలు వచ్చాయి. మద్రాస్‌లో కో డైరెక్టర్లుగా, అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా పనిచేసిన చాలా మంది డైరెక్షర్లు అయ్యారు అని కోటా అన్నారు.

Prev postPage Next post

Leave a Reply

*