కత్తి మహేష్ సంచలన నిర్ణయం! పవర్ స్టార్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏమిటో…

కత్తి మహేష్ అనే పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత హల్చల్ చేస్తుందో అందరికీ తెలుసు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ను వరుస ప్రశ్నలతో  ఉక్కిరి బిక్కిరి చేసిన కత్తి మహేష్ ఫై పవన్ ఫాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే… జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ను వరుస ప్రశ్నలతో  ఉక్కిరి బిక్కిరి చేయడంలో, కత్తి మహేశ్‌ స్వల్ప విరామం ప్రకటించారు.

తను పవన్ ను చాలా ప్రశ్నలు అడిగానని, కాని ఆయన దేనికి సమాధానం ఇవ్వలేదని కత్తి మహేష్ తెలిపారు. అయితే ఇప్పుడు దీనికి కొంత విరామం ఇవ్వాలని అనుకున్తున్నాని చెప్పారు. కాని ఈ నిర్ణయం పవన్ ఫాన్స్ మీద ఆధారపడి ఉంటుందని అన్నారు.

పవన్ ఫాన్స్ గాని, నన్ను మళ్ళీ డిస్టర్బ్ చేస్తే, నేను మళ్ళీ మొదలు పెడతానని చెప్పారు. అందకుని నేను కొన్ని రోజులు సైలెంట్ గా ఉండాలంటే, అది పవన్ ఫాన్స్ చేతిలోనే ఉందని అన్నారు. అంతేకాకుండా, పవన్ ని అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకపోయినా కూడా, జనం మాత్రం వాటి గురించి తప్పకుండా ఆలోచిస్తారని ఆయన అన్నారు. మరి పవర్ స్టార్ ఫ్యాన్స్ రియాక్షన్ ఏమిటో చూద్దాం…

Prev postPage Next post

Leave a Reply

*