కళ్యాణ్ రామ్ MLA రివ్యూ… టాక్ ఎలా ఉందంటే…

నందమూరి కళ్యాణ్ రామ్ తన సినిమా కెరియర్ లో నిలదొక్కుకునేందుకు ఎంత కష్టపడతారో మనందరికీ తెలిసిందే. సినిమా రంగంలో ఈయన ఎన్నో ఒడిదుడుకులణు ఎదుర్కున్నారు. 2015 లో పటాస్ సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. కాని ఆతరవాత షేర్ మరియు ఇజం సినిమాలు హిట్ కాలేదు. ఇప్పుడు MLA సినిమా సినిమా పై మంచి అంచనాలతో ఉన్నారు.

ఈ సినిమా పై ఓవర్ సీస్ లో మంచి టాక్ వచ్చింది. సినిమా కథలో మెసేజ్ ఉన్నా చెప్పిన విధానం ఎక్కువ ఎంటర్ టైన్మెంట్ ధోరణి లో ఉండటంతో అది చాలా వరకు సాటిస్ ఫై చేసే విధంగా ఉండటం సినిమా కి కలిసి వచ్చింది అని అంటున్నారు. రొటీన్ కమర్షియల్ మూవీ నే అయినా కొంత నవ్వించి, కొంత ఆలోజింపజేసి, మంచి మ్యూజిక్ తో అలరిస్తే ఎవరైనా సినిమాను ఇష్టపడతారు. సరిగ్గా కళ్యాణ్ రామ్ MLA విషయం లో ఇదే జరిగింది.

ఫస్టాఫ్ కొద్దిగా స్లో గా ఉన్నా, ఇంటర్వెల్ ముందు నుండి సినిమా పుంజుకుంటుందని, సెకెండ్ ఆఫ్ హిరో విలన్ ల వార్ ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఇందులో కళ్యాణ్ రామ్, కాజల్ ల జంట  బాగుందని అంటున్నారు, సినిమాలో కామెడీ కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయిందని అంటున్నారు. పాటలు యావరేజ్ గా ఉన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయం లో మాత్రం మణిశర్మ మళ్ళీ తన మార్క్ చూపెట్టాడు అంటున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయని అంటున్నారు.

కాని సినిమా కథ రొటీన్ గా ఉండటం, సీన్స్ ముందుగా గ్రహించేటట్టు ఉండటం కొంత మైనస్ అని అనుకుంటున్నారు. సెకెండ్ ఆఫ్ హిరో విలన్ ల వార్ ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా కళ్యాణ్ రామ్ కి పటాస్ తర్వాత మంచి సినిమాగా నిలిపే ప్రయత్నంలో దర్శకుడు  ఉపేంద్ర మాధవ్ చాలా వరకు సక్సస్ అయినట్టే అంటున్నారు.

 

 

 

 

Prev postPage Next post

Leave a Reply

*