ఇంటిలిజెంట్ సినిమా రివ్యూ మరియు రేటింగ్…

ఖైదీ నెంబర్ 150 తరువాత వివి.వినాయక్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా చేసిన సినిమా ఇంటిలిజెంట్. వరుసగా నాలుగు డిజాస్టర్స్ తరువాత సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా చేసారు. అయితే ఈ సినిమా పై మాత్రం మెగా ఫాన్స్ కి భారీ అంచనాలే ఉన్నాయి. ఫిబ్రవరి 9న శుక్రవారం ఈ సినిమా రిలీజ్ అయ్యింది.

కథ…

ఈ సినిమాలో హీరో ధర్మతేజ్ అనే సాఫ్ట్ వేర్ కుర్రాడు చిప్పటినుంచి తన కంఫర్ట్ జోన్ లోనుంచి బయటకు రాకుండా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఒకరోజు ఒక చిన్న పిల్ల రోడ్డు మీద యాక్సిడెంట్ లో చనిపోతుంది. అది యాక్షిడెంట్ కాదని, కావాలనే చంపేశారని తెలుసుకుంటాడు. అల్లరిచిల్లరిగా తిరిగే తన జీవితంలో కొన్ని మార్పులు వలన ధర్మ భాయ్ గా మారతాడు. అసలు ఎందువలన అతను అలా మారాల్సి వచ్చింది, ఎవరి వలన అతను ఆయుధం పట్టాల్సివచ్చింది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే…

సాయి ఇందులో సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా ధర్మా భాయ్ అనే పాత్రలో మొదట అల్లరి చిల్లరి కుర్రడుగా, తరవాత విలన్ ఎదురించే, మైండ్ గేం ఆడే హీరోగా బాగానే నటించాడు. వాళ్ళ మావయ్యలను గుర్తుకు తేచ్చుకునేలా నటించాడు.  ఈ సినిమాలో విలన్ హీరోల మధ్య వచ్చే మైండ్ గేమ్ సీన్స్ హైలెట్ గా ఉంటాయి. వినాయక్ తన రెగ్యులర్ ఫార్మాట్ లా కాకుండా మైండ్ గేమ్ పై కొంత ఫోకస్ పెట్టి తీసాడు.

దానికి కొంత కామెడీ జత కలిపాడు. నిజానికి ఈ సినిమా కథ ఏమి అంత కొత్తగా లేదు. ఎప్పుడు ఉండే రొటీన్ స్టోరీనే. ఈ సినిమా లో చిరు పాటకు మంచి స్పందన వచ్చింది. లావణ్య ఈ సినిమాలో ముందు సినిమాలు కంటే కొంత హాట్ గా కనిపిస్తుంది. మొత్తం మీద సినిమా బాగానే ఉందని అనిపించుకుంది.

రేటింగ్=2.5/5

Prev postPage Next post

Leave a Reply

*