మెజార్టీ బిజెపికి ముఖ్యమంత్రి అఖిలేష్?

ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల్ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించిన తరవాత, యూపీలో ఓపీనియన్ పోల్స్‌ సర్వే ఫలితాలను ఇండియా టుడే సేకరించి తెలిపింది. యూపీలో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని, రెండో స్థానంలో అధికార సమాజ్‌వాదీ పార్టీ నిలుస్తుందని పేర్కొంది. 400 స్థానాలున్న యూపీలో భారతీయ జనతా పార్టీ 33 శాతం ఓట్లతో 206 నుంచి 216 స్థానాలు దక్కించుకుంటుందని, ఆ తర్వాత 26 శాతం ఓట్లతో ఎస్పీ 92 నుంచి 97 స్థానాలు, మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ 79 నుంచి 85 స్థానాలు దక్కుతాయని తెలిపింది.

 కాంగ్రెస్ కు 5 నుంచి 9 స్థానాల్లోనే విజయం సాధిస్తుందని తెలియజేసింది. మిగతా పార్టీలైన రాష్ట్రీయ లోక్ దళ్, అప్నా దళ్, లెఫ్ట్ పార్టీలు 7 నుంచి 11 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని అంటుంది. బీజేపీకే స్పష్టమైన మెజార్టీ వస్తుందని సర్వే పేర్కొన్నప్పటికీ అఖిలేశ్‌ యాదవ్ తిరిగి సీఎం పగ్గాలు చేపట్టాలని 33 శాతం మంది కోరుకాగా… తర్వాతి స్థానాల్లో 20 శాతం ఓట్లతో కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, 18 శాతం ఓట్లతో గోరఖ్‌పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌‌లు ఉన్నారు.

Prev postPage Next post

Leave a Reply

*