హలో సినిమా గురించి చైతూ, సమంత లైవ్ లో మాట్లాడుతూ…అసలు విషయం చెప్పేసారు…

అక్కినేని అఖిల్ సినిమా ఈ నెల 22 న మన ముందుకు రాబోతుంది. హలో అంటూ అందరిని పలకరిస్తూ వస్తున్నాడు అఖిల్. ఈ సినిమా పై అక్కినేని భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా పై మొదటి నాగార్జున చాలా కేర్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అఖిల్ మొదటి సినిమా పరాజయాన్ని చవి చూసినప్పటికీ, ఈ సినిమా మాత్రం మంచి హిట్ కొట్టాలని నాగ్, అఖిల్ ఇద్దరూ మరియు ఆ సినిమా టీం అందరూ కూడా కృషి చేసారు.

ఈ సినిమా ఆడియో వేడుక వైజాగ్ లో ఈరోజు జరిగింది. దీనికి నాగార్జున, అమల కూడా వచ్చారు. ఆడియో వేడుకలో అఖిల్ పాట పాడటం నిజంగా అక్కినేని ఫాన్స్ కి ఆనందాన్ని కలిగించింది. అయితే అందమైన ఈ పరివారంలో, ఆ క్యూట్ జంట లేరని అక్కినేని ఫాన్స్ కొంత నిరుత్సాహపడతారని, నాగ్ కి ముందే తెలుసు అనుకుంటా. ఈ షో గురించి చైతు, సమంతా లైవ్ లో కి వచ్చి విషెస్ చెప్పారు. అంతే కాకుండా అఖిల్ గురించి, ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను ఫాన్స్ తో పంచుకున్నారు.

అఖిల్ ఈ సినిమా గురించి ఎంతో కష్టపడ్డాడని, ఈ సినిమా గురించి నాగ్ మిగిలిన టీం కూడా ఎంతో బాగా కృషి చేసారని చెప్పారు. సమంత కూడా అఖిల్ కు హలో సినిమాకి మొత్తం టీం కి విషెస్ చెప్పింది. అయితే చైతూ మాట్లాడుతూ… అఖిల్ కి అన్నగా నాకు ఎప్పటి నుంచో తనని మంచి లవ్ బాయ్ గా సినిమాలో చూడాలని కోరిక అని తన మససులో మాట చెప్పాడు. అఖిల్ ఫైట్స్, డాన్స్ అన్ని బాగుంటాయి,కాని ఒక మంచి లవర్ గా చూడాలని నా కోరిక. ఆ కోరిక ఇప్పుడు ఈ సినిమాతో తీరుతుందని చెప్పాడు. ఏది ఏమైనా ఈ జంట మాటలతో విందు భోజనం సంపూర్ణం అయినట్టు అనిపించింది ఆ వేడుక… ఆ వీడియో ఇక్కడ మీ కోసం…

Prev postPage Next post

Leave a Reply

*