గల్ఫ్ మూవీ రివ్యూ మరియు రేటింగ్…

నటీనటులు: చేతన్ మద్దినేని, డింపుల్ చోపడే, సంతోష్ పవన్,అనిల్ కళ్యాణ్, పూజిత, సూర్య , శివ, పోసాని, నాగినీడు, జీవ, నల్ల వేణు, ప్రభాస్ శ్రీను, తనికెళ్ళ భరణి, తోటపల్లి మధు, శంకరాభరణం రాజ్యలక్ష్మి, సన, తీర్థ, డిగ్గీ, బిత్తిరి సత్తి,భద్రం, మహేష్, ఎఫ్ ఎం బాబాయ్

దర్శకత్వం: పీ సునీల్ కుమార్ రెడ్డి

 సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి

 మాటలు: పులగం చిన్నారాయణ

పరాయి దేశం వెళ్లి జనం పద పాట్లు ఎలా ఉంటున్నాయో చూపించే ప్రయత్నంలో పీ సునీల్ కుమార్ రెడ్డి దర్శకతంలో గల్ఫ్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సునీల్ కుమార్ రెడ్డి రూపొందించే చిత్రాల్లో వాణిజ్య విలువల కంటే ప్రజల జీవితాలు, ఆ జీవితాల్లోని కష్టాలు స్పష్టంగా కనిపిస్తాయి. మరి ఇప్పుడు సినిమా ఎలా ఉందొ తెలియాలంటే కథ లోకి వెళ్దాం..

కథ…

ఉద్యోగం కోసం సిరిసిల్లా చేనేత కార్మికుల్లో ఒకడైన  శివ (చేతన్ మద్దినేని) గల్ఫ్‌కు వెళ్తాడు. వెళ్ళేటప్పుడు విమానంలో అతనికి లక్ష్మీ (డింపుల్) పరిచయం కాగా, తొలి చూపులోనే ఒకరంటే ఒకరికి మంచి అభిప్రాయం పడతుంది. ఆ తరవాత వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. అయితే అక్కడ ఉద్యోగాలలో కష్టాలు మొదలవుతాయి. మోసాలు, అన్యాయాలు లక్ష్మీపై శారీరక దాడులు,లైంగిక వేధింపులు ఎక్కువ అవుతాయి. లక్ష్మి జీవితం కన్నీళ్ళ పాలు అవుతుంది. అలాగే అప్పులు తీర్చుకోవడానికి వచ్చిన శివ కూడా మోసాలకు గురవుతాడు. అలా వీరిద్దరి కష్టాలను ఎలా ఎదిరించి, చివరికి సొంత దేశం చేరారు అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.

సినిమా ఎలా ఉందంటే…

ఉన్న ఊరులో కష్టపడి ఎదిగే కంటే, పరాయి దేశం వెళ్లి, చాలా ఈజీగా సంపాదన చేసుకుని ఉన్న బాధలను తగ్గించుకుందామని అనుకునే వారి జీవితాలలో, గల్ఫ్ దేశాలు వెళ్లి ఎన్ని కష్టాలు పడతున్నారో తెలుస్తుంది. సొసైటీలో జరుగుతున్న ఈ బాధలను కల్లలు కట్టినట్టు చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యేడు. నటీనటులు కూడా బాగానే నటించారు. అయితే సినిమా నిర్మాణపు విలువలు కొంచెం పెంచితే బాగున్ను అనిపిస్తుంది. పాటలు కూడా బాగానే అలరించాయి. సెకండ్ ఆఫ్ అంత బాగా తియ్యలేకపోయారని, కొంచెం బలమైన సన్నివేశాలు ఉంటె బాగున్ను అనిపిస్తుంది. ఏది ఏమైనా సినిమా పరవాలలేదు అనిపించుకుంది…

రేటింగ్; 2.5/5

Prev postPage Next post

Leave a Reply

*