గౌతమీపుత్ర శాతకర్ణి… రివ్యూ – రేటింగ్

సినిమా- గౌతమీపుత్ర శాతకర్ణి

నటీనటులు- బాలకృష్ణ , శ్రియ,హేమమాలిని, కబీర్ బేడీ, శివరాజకుమార్ తదితరులు

మ్యూజిక్ – చింతన్ బట్

దర్శకత్వం- క్రిష్

బాలయ్య 100 చిత్రం క్రిష్ దర్సకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన గౌతమీపుత్ర శాతకర్ణి ఈ రోజు మనందరి ముందుకు వచ్చింది. ఈ సినిమాపై  అంచనాలు చాలా భారిగా ఉన్నాయి. మరి బాలయ్య, క్రిష్ ఎంత వరకు ఆ అంచనాలను సాధించారో తెలియాలంటే కథలోకి వెళదాం…

కథ…

క్రీ.శ. 1-2 మద్య కాలానికి చెందినది ఈ కథ. ఒకే రాజ్యం.. ఒకే యుద్ధం.. అఖండ భరత జాతి అని కలలుగన్న శాతవాహన చక్రవర్తి శాతకర్ణి (బాల‌కృష్ణ‌). తన తండ్రి యుద్దానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో… తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు శాతకర్ణి. అప్పుడు అతని తల్లి నాయన తండ్రి కోసం ఎదురు చూస్తునావా అని అడుగుతుంది. క ప్రజలు ఎందుకు కొట్టుకున్తున్నారమ్మ అని అడుగుతాడు. ప్రజలు కాదు నాయన అధికారం కోసం పాలకులు కొట్టుకుంటున్నారు అని తల్లి సమాధానం చెబుతుంది. ఇన్ని రాజ్యాలు కాకుండా ఒక్క రాజ్యమే ఉంటె గొడవ ఉండదుగా అంటాడు . అలా చేయగలిగే వీరుడు పుట్టలిగా అని తల్లి చెప్పగా, నేను పుట్టాను కదమ్మా అని శాతకర్ణి అంటాడు. అలా చిన్నప్పుడే ఒక అక్ష్యంతో మొదలవుతుంది శాతకర్ణి జీవితం.  దక్షిణ భారతంలో తిరుగులేని వీరునిగా కుంతల, కల్యాణ దుర్గం రాజ్యాలను హస్తగతం చేసుకుంటాడు. సౌరాష్ట్ర రాజ్యానికి చెందిన నహపాణుడి(కబీర్‌బేడీ)ని ఓడించి శకపురుషుడిగా అవతరిస్తాడు. ఇలా ఉండగా శతకర్నికి పెళ్లి అవుతుంది. సంతోషంగా దాంపత్య జీవితం సాగుతూ ఉంటుంది. ఉత్తరదక్షిణాదిలతో అఖండ భారతాన్ని ఏకఛత్రాధిపత్యం కిందకి తీసుకొస్తాడు. అయితే.. అలెగ్జాండర్‌ కలలుగన్న అఖండభారతాన్ని చేజిక్కించుకోవాల‌ని గ్రీకు చక్రవర్తి డెమిత్రియస్‌ సింధు నుంచి పోరాటానికి దిగుతాడు. శాతకర్ణిపై విషప్రయోగానికి పూనుకుంటాడు. మరి డెమిత్రయస్‌ని శాతకర్ణి ఎలా ఓడించాడు? తాను కలలుగన్న అఖండభారతావనిని ఎలా సృష్టించాడు? అన్న‌ది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే…

న‌ట‌న ప‌రంగా ఇందులో బాల‌కృష్ణ విశ్వ‌రూపం క‌నిపిస్తుంది. ఆయ‌న సంభాష‌ణ‌ల్ని ప‌లికిన విధానం ఆక‌ట్టుకునేలా ఉంది. హేమ‌మాలిని, శ్రియ న‌ట‌న చాలా బాగుంది. శాత‌క‌ర్ణి మాతృమూర్తి పాత్ర‌లో హేమ‌మాలిని చాలా బాగా చేసింది. శ్రియ న‌ట‌న కొన్ని స‌న్నివేశాల్లో కంట‌త‌డి పెట్టిస్తుంది. సాంకేతికంగా ఈ సినిమాకి వంద‌కి వంద మార్కులు వస్తాయి. కథ, కధనం కూడా చాలా బాగుంది. నందమూరి ఫాన్స్ కి ఎంతో ఆనందాన్ని, బాలయ్య జీవితంలో చెప్పుకోతగ్గ సినిమాగా రూపుదిద్దుకుంది. మొత్తం మీద ఈ పండక్కి బాలయ్య బంపర్ హిట్ కొట్టాడు.

రేటింగ్- 4/5

 

 

Prev postPage Next post

Leave a Reply

*