కత్తి మహేష్ అరెస్ట్…?

గత కొన్నిరోజులుగా మహేష్ కత్తి, పవన్ కళ్యాణ్ పై అనేక విమర్శలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాజేకీయం అంతా కూడా షూటింగ్ అయిన తరవాత టైం పాస్ కోసం క్యాంప్ కి వెళ్లినట్టు వెళ్లి, సభలు పెట్టి మాట్లాడుతూ ఉంటాడు అని మహేష్ కత్తి పవన్ ని విమర్శించారు. ప్రశ్నిస్తాను అన్న పవన్ కళ్యాణ్ మోడీని, చంద్రబాబు ని గత 3 సంవత్సరాలుగా ఎందుకు ప్రశ్నించలేదు అని ఆయన అడిగారు.

ఇలా పవన్ మాట్లాడే ప్రతీ మాటకి కత్తి మహేష్ వెంటనే అందుకుంటున్నారు. ఆ విమర్శలకు  ఇప్పుడు పవన్ ఫాన్స్ కి ఆగ్రహం వచ్చింది. అయితే అంతటితో కత్తి మహేష్ ఊరుకోలేదు. మీ ఫాన్స్ గూండాయిజాన్ని ఆపండి అంటూ పవన్ కే చెప్పారు. ఇదిలా ఉంటె మహేష్ కత్తి, పవన్ కళ్యాన్ మరియు మోడీ ని కూడా విమర్శించారు. ఇది ఇప్పుడు పెద్ద ఇష్యూ అయ్యింది.

ఈ విషయమై హైదరాబాద్ పోలీసులకు, ఎమ్మెల్యే రాజా సింగ్ కత్తి మహేష్ ని అరెస్ట్ చేయాలని ట్విట్టర్ లో ఫిర్యాదు చేసారు. అసలు ఏం జరిగిందో ఈ క్రింది వీడియోలో చూడండి…

Prev postPage Next post

Leave a Reply

*