చంద్రబాబు సర్కారు చిరంజీవి సినిమాని టార్గెట్ చెయ్యడానికి అసలు కారణాలు ఇవేనంట…

మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.ముందుగా ఈ ప్రి రిలీజ్ ఫంక్ష‌న్ వేదిక విజ‌య‌వాడ అనుకుని..ఇక్క‌డ ఏపీ ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు రాక‌పోవ‌డంతో త‌ర్వాత గుంటూరు జిల్లాలోని హాయ్‌లాండ్‌కు మార్చారు. ఇక్క‌డ ఈ వేడుక‌కు సంబంధించిన ఏర్పాట్ల‌ను చిరు బావ‌మ‌రిది, అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇంతలా చిరంజీవి సినిమాని టార్గెట్ చెయ్యడానికి అసలు కారణం రైతు బ్యాక్డ్రాప్ లో నిర్మిస్తున్న సినిమా కావడం అందులో ఎపి ప్రభుత్వానికి, చంద్రబాబు కి వ్యతిరేకంగా పలు గాటు డైలాగ్స్ ఉన్నాయంట!

వాటిని తొలిగించమని వర్తమానం పంపినా కూడా ఖైదీ టీం ఖాతరు చేయ్యకపోవడంతో… చంద్రబాబు సర్కారు కక్ష సాదిస్తోందని ఫిల్మ్ నగర్ లో వార్త చక్కర్లు కోడతున్నది. వేడుక ప్లేస్ మార్చాల్సి రావ‌డం ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌లో పెద్ద ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ఇక హాయ్‌లాండ్‌లో చిరు మూవీ ప్రి రిలీజ్ ఫంక్ష‌న్ ఏర్పాట్లు ప‌ర్య‌వేక్షిస్తోన్న అల్లు అర‌వింద్‌ను కొంద‌రు మీడియా వాళ్లు వేదిక మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింద‌ని ప్ర‌శ్నించారు. దానికి సమాధానం చిరంజీవిగారే ఇస్తారని చెప్పారు. అర‌వింద్ చెప్పిన మాట‌ల‌ను బ‌ట్టి హాయ్‌లాండ్లో జ‌రిగే ఫంక్ష‌న్ వేదిక‌మీద ఏపీ స‌ర్కార్ ని మరియు చంద్రబాబుని టార్గెట్‌గా ప‌లు ప్ర‌శ్నాస్త్రాలు సంధించే అవ‌కాశం ఉంద‌ని, మీడియా వ‌ర్గాలు, రాజ‌కీయ‌వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

Prev postPage Next post

Leave a Reply

*