చిరు ఖైదీ నంబర్ 150 సినిమా ప్రేక్షకుల రివ్యూ… ఆ సీన్ హైలెట్..కాని

సినిమా- ఖైదీ నంబర్ 150

నటీనటులు- చిరంజీవి, కాజల్ తదితరులు….

మ్యూజిక్ – దేవిశ్రీ

దర్శకత్వం- వి. వి. వినాయక్

నిర్మాత- రామ్ చరణ్

వి. వి. దర్శకత్వంలో చిరు 150 వ సినిమా ఈ రోజు వచ్చిన సంగతి మనందరికీ తెలిసినదే. ఈ సినిమా కోసం ఎంతగా ఎదురు చూసారో మెగా ఫాన్స్ చెప్పుకోనవసరం లేదు. పదేళ్ళ తరవాత చిరు ఎంట్రీ , ఠాగూర్ తరవాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎలా అలరించిందో చూద్దాం …

కథ…

చిరంజీవి ఎంట్రెన్స్ జైల్లో అవుతుంది. కలకత్తా జైల్లో ఒక ఖైదీ పారిపోతుంటే పోలీసులు కైదీ నంబర్ 150 అదే చిరు హెల్ప్ అడుగుతారు. పోలీసులకు హెల్ప్ చేసి శ్రీను(చిరు) జైలు నుండి పారిపోతాడు. అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేస్తాడు. హైదరాబాద్ లో చిన్న చిన్న దొంగతనాలు చేసి, ఆ డబ్బుతో బ్యాంగ్ కాంగ్ వెళ్ళిపోవాలని ప్లాన్ వేస్తాడు. దీనికి ఆలీ తను కలసి అన్ని ప్రిపేర్ చేసుకుని ఎయిర్ పోర్ట్ కి వెళ్తారు. అక్కడ కాజల్ ని చూస్తాడు. నా చిన్నప్పటి సుబ్బలక్ష్మి తినే అంటూ బ్యాంగ్ కాంగ్ వెళ్ళకుండా ఆగిపోయి మరీ కాజల్ వెనక పడతాడు. కాజల్ చిరుకి రాంగ్ నంబర్ ఇస్తాది. మొత్తానికి అమ్మడు వెనక పడతాడు కుమ్మడానికి మన చిరు. ఇలా వీళ్ళ లవ్ రొమాన్స్ నడుస్తూ ఉంటాది.

ఒక రోజు ఒక కాయగూరలు అమ్ముకునే అతడిని కొందరు విలన్స్ వచ్చి కాల్చి వెళ్ళిపోతారు. అది చూసిన చిరు ఆ వ్యక్తిని కాపాడటానికి వెళతాడు. తీరా చూస్తే అక్కడ తనలానే ఉన్న మరో చిరు (శంకర్ ) అక్కడ ఉంటాడు. తనని తీసుకువెళ్లి ఆసుపత్రిలో చేర్పిస్తాడు. అక్కడకు వచ్చిన పోలీసులను చూసి, తన ఐడి ని అక్కడ పెట్టి, శంకర్ ఐడి ని చిరు శ్రీను తీసుకుని బయటకి వచ్చేస్తాడు. శంకర్ ని పోలీసులు శ్రీను అనుకుని జైలుకు తీసుకుని వెళతారు.

ఇక్కడ శ్రీను ని శంకర్ అనుకుని, కొందరు తన దగ్గరకి వచ్చి కలెక్టర్ గారు పిలుస్తున్నారని తీసుకుని వెళ్లి, ఒక వృద్దాశ్రమానికి తీసుకుని వెళతారు. అక్కడ అందరూ శ్రీనుకు కి శంకర్ అనుకుని సన్మానం చేస్తారు. అప్పుడు శంకర్ స్టోరీ మొదలవుతుంది. శంకర్ ఒక రైతుబిడ్డ . భూమి లో వాటర్ కి సంబందించిన చదువు చదువుకున్న శంకర్, వాళ్ళ పొలాలలో నీళ్ళు ఉన్నాయి కాని, వారికి రానివ్వడం లేదని తెలిసి పోరాడతాడు. ఈ నేపద్యంలో శంకర్ తండ్రితో పాటు కొంతమందిని విలన్స్ చంపేసి ఆత్మహత్య అని చిత్రీకరిస్తారు. అది ఆత్మ హత్యకాదు, హత్యని గుర్తించిన చిరు కోర్టులో కేసు వెయ్యగా అతనిని జైలు లో పెడతారు. అయితే చిరుని కాపాదమిని ఆరుగురు రైతులు మీడియాను ఆశించగా, వారు ఇలాంటి చిన్న చిన్నవి వేయమని అంటారు. అప్పుడు ఆ ఆరుగురు వారి పొలంలో లైవ్ ఆత్మహత్య చేసుకోగా అప్పుడు అది పెద్ద ఇష్యూ అయ్యి చిరుని బయటకి వదులుతారు. అలా తన ఊరి సమస్యల కోసం నీరు కోసం, తన తండ్రి కోసం అన్నీటి గురించి చట్టంతో పోరాడుతూ కేసులు వేసి, హైదరాబాద్లో కాయగూరలు అమ్ముకుంటూ… కొంత మంది వ్రుద్దులను చూస్తూ నివశిస్తుంటాడు.

ఇది తెలిసిన చిరూ, శంకర్ కోసం ఆరైతులు చేసిన ప్రాణ త్యాగం, అందిరికి అతనిపై ఉన్న ఆశ నమ్మకం అన్నీ చూసి థానే ఇంకనుంచి శంకర్ అని డిసైడ్ అవుతాడు. ఇక్కడితో ఇంటర్వెల్… సినిమా ఇక్కడి వారు హైలెట్ గా ఉంది. మరితరవాత భాగం కొద్ది సేపటిలో…  

సెకండ్ ఆఫ్ లో శంకర్ ఆశయాలను తీర్చడానికి శ్రీను కృషి చేసి రైతులకు శంకర్ గా దగ్గర  అవుతాడు.  ఇతర దేశాలలో పని చేసుకుంటున్న భూమి యజమానులను రప్పించడానికి, మీడియా సహకారం కోసం చిరు ప్లాన్ లు వేస్తాడు. దానికి రైతులు, ఈ వృద్దులు అందరూ తోడుగా నిలుస్తారు.ఇదిలా జరుగుతుండగా శంకర్ బయటకు వస్తాడు. శంకర్ మొదట శ్రీనుని అపార్ధం చేసుకుని తరవాత అర్ధం చేసుకుంటాడు. హైదరాబాద్ మొత్తం నీరు ఆపేసి, శ్రీను సంచలనం సృష్టిస్తాడు. ఆ తరవాత మీడియా కూడా వారికి తోడుగా నిలుస్తారు. ఇద్దరు చిరూ లు ఎలా కలిసారు? విలన్స్ ని ఎలా ఎదుర్కున్నారు? చివరికి ఏం జరిగింది అన్ని తెలియాలంటే సినిమా చూడాలి…

సినిమా ఎలా ఉందంటే…

ప్లస్ పాయింట్స్…

పది సంవత్సరాల తరవాత వచ్చిన చిరు, ఎక్కడా అలాంటి ఫీలింగ్ రానివ్వకుండా అదరోగొట్టాడు. వినాయక్ తన దర్శక ప్రతిభను మళ్ళీ నిరూపించుకున్నాడు. రైతుల కోసం పోరాటం, వారి గురించి డైలాగ్స్ అదరగొట్టాడు. చిరు తన వయసుని మరిపించాడు. పాటలు మంచి ఊపుగా ఉన్నాయి. కాజల్ తన అందచందాలతో, చిరుతో స్టెప్స్ లో చాలా బాగా చిందులు వేసింది. రైతుల ఆత్మహత్య సీన్, వాటర్ ని ఆపడం సీన్ లు సినిమాకి హైలెట్. సినిమాలో చిరు డైలాగ్స్ ఠాగూర్ ని గుర్తుకు తెచ్చాయి. ఈ సినిమాలో అన్నిటికంటే హైలెట్ పైగా ఆ ఒక్క సీన్ కోసం సినిమా తప్పకుండా చూడాలి. అదేమిటంటే చిరు, రామ్ చరణ్ కలసి అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటలో వాల్లిదరు కలసి వేసిన డాన్స్ అదిరింది.

మైనస్ పాయింట్స్ …

చిరు డాన్స్ లో క్రేజ్ తగ్గింది. సినిమాలో విలనిజం ఆకట్టుకోలేకపోయింది. డబల్ యాక్షన్ వర్క్ అవుట్ అవ్వలేదు. కథలో కొత్తదనం లేదు.

రేటింగ్.. ౩/5 

th

Prev postPage Next post

Leave a Reply

*