చిరు ఖైదీ నంబర్ 150 సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ అదుర్స్…

వి. వి.వినాయక్  దర్శకత్వంలో చిరు 150 వ సినిమా ఈ రోజు వచ్చిన సంగతి మనందరికీ తెలిసినదే. ఈ సినిమా కోసం ఎంతగా ఎదురు చూసారో మెగా ఫాన్స్ చెప్పుకోనవసరం లేదు. పదేళ్ళ తరవాత చిరు ఎంట్రీ , ఠాగూర్ తరవాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎలా అలరించిందో చూద్దాం …

కథ…

చిరంజీవి ఎంట్రెన్స్ జైల్లో అవుతుంది. కలకత్తా జైల్లో ఒక ఖైదీ పారిపోతుంటే పోలీసులు ఖైదీనంబర్ 150 అదే చేరు హెల్ప్ అడుగుతారు. పోలీసులకు హెల్ప్ చేసి శ్రీను(చిరు) జైలు నుండి పారిపోతాడు. అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేస్తారు. హైదరాబాద్ లో చిన్న చిన్న దొంగతనాలు చేసి, ఆ డబ్బుతో బ్యాంగ్ కాంగ్ వెళ్ళిపోవాలని ప్లాన్ వేస్తాడు. దీనికి ఆలీ తను కలసి అన్ని ప్రిపేర్ చేసుకుని ఎయిర్ పోర్ట్ కి వెళ్తారు. అక్కడ కాజల్ ని చూస్తాడు. నా చిన్నప్పటి సుబ్బలక్ష్మి తినే అంటూ బ్యాంగ్ కాంగ్ వెళ్ళకుండా ఆగిపోయి మరీ కాజల్ వెనక పడతాడు. కాజల్ చిరుకి రాంగ్ నంబర్ ఇస్తాది. మొత్తని అమ్మడు వెనక పడతాడు కుమ్మడానికి మన చిరు. ఇలా వీళ్ళ లవ్ రొమాన్స్ నడుస్తూ ఉంటాది.

ఒక రోజు ఒక కాయగూరలు అమ్ముకునే అతడిని కొందరు విలన్స్ వచ్చి కాల్చి వెళ్ళిపోతారు. అది చూసిన చిరు ఆ వ్యక్తిని కాపాడటానికి వెళతాడు. తీరా చూస్తే అక్కడ తనలానే ఉన్న మరో చిరు (శంకర్ ) అక్కడ ఉంటాడు. తనని తీసుకువెళ్లి ఆసుపత్రిలో చేర్పిస్తాడు. అక్కడకు వచ్చిన పోలీసులను చూసి, తన ఐడి ని అక్కడ పెట్టి, శంకర్ ఐడి ని చిరు శ్రీను తీసుకుని బయటకి వచ్చేస్తాడు. శంకర్ ని పోలీసులు శ్రీను అనుకుని జైలుకు తీసుకుని వెళతారు.

ఇక్కడ శ్రీను ని శంకర్ అనుకుని, కొందరు తన దగ్గరకి వచ్చి కలెక్టర్ గారు పిలుస్తున్నారని తీసుకుని వెళ్లి, ఒక వృద్దాశ్రమానికి తీసుకుని వెళతారు. అక్కడ అందరూ శ్రీనుకు కి శంకర్ అనుకుని సన్మానం చేస్తారు. అప్పుడు శంకర్ స్టోరీ మొదలవుతుంది. శంకర్ ఒక రైతుబిడ్డ . భూమి లో వాటర్ కి సంబందించిన చదువు చదువుకున్న శంకర్, వాళ్ళ పొలాలలో నీళ్ళు ఉన్నాయి కాని, వారికి రానివ్వడం లేదని తెలిసి పోరాడతాడు. ఈ నేపద్యంలో శంకర్ తండ్రితో పాటు కొంతమందిని విలన్స్ చంపేసి ఆత్మహత్య అని చిత్రీకరిస్తారు. అది ఆత్మ హత్యకాదు, హత్యని గుర్తించిన చిరు కోర్టులో కేసు వెయ్యగా అతనిని జైలు లో పెడతారు. అయితే చిరుని కాపాదమిని ఆరుగురు రైతులు మీడియాను ఆశ్రయించగా, వారు ఇలాంటి చిన్న చిన్నవి వేయమని అంటారు. అప్పుడు ఆ ఆరుగురు వారి పొలంలో లైవ్ ఆత్మహత్య చేసుకోగా అప్పుడు అది పెద్ద ఇష్యూ అయ్యి చిరుని బయటకి వదులుతారు. అలా తన ఊరి సమస్యల కోసం నీరు కోసం, తన తండ్రి కోసం అన్నీటి గురించి చట్టంతో పోరాడుతూ కేసులు వేసి, హైదరాబాద్లో కాయగూరలు అమ్ముకుంటూ… కొంత మంది వ్రుద్దులను చూస్తూ నివశిస్తుంటాడు.

ఇది తెలిసిన చిరూ, శంకర్ కోసం ఆరైతులు చేసిన ప్రాణ త్యాగం, అందిరికి అతనిపై ఉన్న ఆశ నమ్మకం అన్నీ చూసి తనే ఇంకనుంచి శంకర్ అని డిసైడ్ అవుతాడు. ఇక్కడితో ఇంటర్వెల్… సినిమా ఇక్కడి వారు హైలెట్ గా ఉంది. మరితరవాత భాగం కొద్ది సేపటిలో…  

Prev postPage Next post

Leave a Reply

*